Hyd, Sep 13: రేవంత్ రెడ్డి అనే వాడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడంటూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మటాష్ చేస్తున్నాడు. షర్మిలని రాకుండా అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. సమైక్య మద్దతుదారులు రావొద్దు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసుకున్నావ్? డబ్బులు ఇస్తే తీసుకున్నావ్. తుమ్మలని ఎందుకు చేర్చుకుంటున్నావ్ రేవంత్ రెడ్డి? సమైక్య వాదంకి మద్దతిచ్చిన సిపిఎంతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు.
జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao)మాట్లాడుతూ..జమిలి ఎన్నికలు జరగడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని.. బీజేపీ 15 రాష్ట్రాలు ముందస్తుకు పోతే 19 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని గోనె ప్రకాష్ రావు స్పష్టం చేశారు.
ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ..చంద్రబాబును అరెస్ట్ చేసి ఆయన నెత్తిపై జగన్ పాలు పోశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.” తాను జైలుకి వెళ్ళడానికి కారణమైన వారిని జైలుకి పంపాలని చంద్రబాబును జైలుకి పంపారు జగన్. ప్రైమాఫెసి ఉందని చంద్రబాబును అరెస్ట్ చేశామని సజ్జల చెప్పడం సిగ్గుచేటు. జగన్ శాడిస్టులా వ్యవహరిస్తున్నారు. అరెస్ట్ చేసి చంద్రబాబు నెత్తిపై పాలు పోశారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారు. ఈసారి 151 పైగా స్థానాల్లో టీడీపీ గెలుపొందుతుందని జోస్యం చెప్పారు.
Here's Video
రేవంత్ అనే వాడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు - గోనె ప్రకాశ్ రావు
రేవంత్ అనే వాడు కాంగ్రెస్ పార్టీని మటాష్ చేస్తున్నాడు. షర్మిలని రాకుండా అడ్డుకుంటున్నాడు.
సమైక్య మద్దతుదారులు రావొద్దు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసుకున్నావ్? డబ్బులు ఇస్తే తీసుకున్నావ్.… pic.twitter.com/5N4SFdKxBS
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2023
టీడీపీ కేడర్ భయపడాల్సిన అవసరం లేదు. స్వాతంత్ర్యం వచ్చాక అరెస్ట్ చేసిన వారిని భద్రత పేరుతో ఇంట్లో ఉంచిన పరిస్థితి లేదు. చంద్రబాబుకి జైల్లో పూర్తి రక్షణ ఉంటుంది. జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, చౌతాలా, రాజా అనేకమంది జైలుకెళ్లారు. ఎవరినీ ఇంటి వద్ద ఉండనివ్వ లేదు. చంద్రబాబు కుటుంబం భయపడాల్సిన అవసరం లేదు. జైలులో భద్రత ఉంటుంది. భద్రత పెంచాలంటే పిటిషన్ వేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది. ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు. జగన్ ఎందుకు జైలుకి వెళ్లారో సజ్జల చెప్పాలి. సజ్జల ఒక బ్రోకర్” అని నిప్పులు చెరిగారు గోనె ప్రకాశ్ రావు.
ఏ సర్వేలు చూసిన జగన్ కచ్చితంగా ఓడిపోతారని చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి 88 కంటే ఎక్కువ సీట్లు ఖాయం. పవన్ కళ్యాణ్ కలిస్తే 130 సీట్లు వస్తాయి. బాబు అరెస్టుతో తమ పని అయిపోయిందని వైఎస్సార్సీపీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఓడిపోతే సభకు వెళ్లరు. చంద్రబాబును అరెస్టు చేయడం తెలుగు ప్రజలకు చీకటి రోజు. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో అసలు ఏమీ లేదు. జగన్ మీద ఉన్న కేసులు అలా కాదు. ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలియదా?
నేను కూడా వారికి ఆర్థిక సహాయం చేశాను. తేదీలతో సహా నేను చెప్పగలను. ఆయనకు ఈ వేల కోట్లు ఎక్కణ్ణుంచి వచ్చాయి? ఇప్పటికైనా జగన్ మారాలి. లేదంటే నీ వెంట ఉన్నవాళ్లంతా చెట్లు, పుట్టలు పట్టుకుని వెళ్లిపోవడం ఖాయం. కనుచూపు మేరల్లో ఉండరు. దేశం వదిలి పారిపోవాల్సి వస్తుంది. నీ చర్యల కారణంగా నీ వెంట ఉన్నవాళ్లు నష్టపోతారని తెలిపారు.
చరిత్రలో హౌజ్ రిమాండ్ ఇచ్చిన ఉదంతాలు లేవు అని నిన్న చెప్పాను. 2021లో మహారాష్ట్రలో, పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురి విషయంలో హౌజ్ రిమాండ్ ఇచ్చారు. ఈ నలుగురికి తప్ప మరెవరికీ ఇచ్చినట్టు చరిత్రలో లేదు. ఈ ఉదాహారణలు కోర్టులో వెల్లడిస్తే చంద్రబాబుకు కూడా హౌజ్ రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయ ఖైదీలకు ప్రత్యేక సెల్, ప్రత్యేక వెసులుబాట్లు ఉంటాయి. బయటి నుంచి కూరగాయలు తెప్పించుకోవచ్చు. వంట చేసుకోవచ్చు. నేను కూడా రాజకీయ ఖైదీగా నేను, నాయిని నర్సింహా రెడ్డి తదితరులు చాలా మంది ఉన్నాం. జైలర్లు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తారు. కాబట్టి కోర్టు చెప్పిన సదుపాయాలు జైలులో కల్పించలేదని నిన్న భువనేశ్వరి చెప్పారు.
కోర్టుకు చెవులే ఉంటాయి. కళ్లు ఉండవు. చంద్రబాబుకు జైల్లో ప్రాణహానికి అవకాశం ఉంది. బయట నుంచి ఆహారం తీసుకెళ్లినా సరే.. మార్గ మధ్యలో అందులో విషం కలిపే అవకాశం ఉంది. మహారాష్ట్ర, బెంగాల్ తరహాలో చంద్రబాబుకు హౌజ్ రిమాండ్‌కు అవకాశం ఇవ్వండి. జగన్ దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.