Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తోందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Rain alert for AP (Photo-ANI)

Vjy, Dec 19: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తోందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలవైపు వెళ్తుందని, ఆ తర్వాత కోస్తా తీరం వెంబడి కదులుతుందని పేర్కొంది.

దీని ప్రభావంతో భారీ వర్షాలతోపాటు తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో నేడు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.

తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కాగా, వాతావరణ మార్పుల కారణంగా ఏపీలోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో, అక్కడ తీరం దాటాల్సినవి మన రాష్ట్రంలో దాటుతున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ నెలాఖరున అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తకువగా, 15 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(యూ)లో కనిష్టంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. హైదరాబాద్‌లో 11.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత అధికంగా ఉన్న 15 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, 17 జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లోఅలర్ట్‌ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఏపీలో 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని స్పష్టంచేశారు.

(The above story first appeared on LatestLY on Dec 19, 2024 12:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).