Wine Shops Close in Hyderabad: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్స్ బంద్.. ఎప్పుడంటే?
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సౌత్ జోన్ లో బోనాల పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ దుకాణాలు బంద్ కానున్నాయి.
Hyderabad, July 27: హైదరాబాద్ (Hyderabad) కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సౌత్ జోన్ లో బోనాల పండుగ (Bonalu) సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ దుకాణాలు (Wine Shops) బంద్ కానున్నాయి. అలాగే హైదరాబాద్ కోర్ సిటీ సౌత్ జోన్ లో ఆదివారం ఉదయం 6 గంటల నుండి మంగళవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ షాప్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
హైదరాబాద్లో వైన్స్ బంద్
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సౌత్ జోన్లో బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 29 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్.
అలాగే హైదరాబాద్ కోర్ సిటీ సౌత్ జోన్లో ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 30 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్. pic.twitter.com/8pAgy8rIpZ
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2024
ట్రాఫిక్ నిబంధనలు
సింహ వాహినీ శ్రీ మహంకాళి లాల్ దర్వాజ బోనాల వేడుకల ఆదివారంనాడు.. అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు సోమవారం నాడునిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ రెండు రోజులపాటు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలోని ఫలక్ నూమా, చార్మినార్, మీర్ చౌక్, బహదూర్ పురాలో ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయి.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

