Paris, July 27: విశ్వక్రీడలకు తెరలేచింది. అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో చారిత్రక సీన్ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్ (France) ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది. ఒలింపిక్స్ ను (Paris Olympics 2024) అందరికీ చేరువ చేయలనే రీతిలో స్టేడియానికి పరిమితం కాకుండా నదిని వేదికగా మలుచుకుంటూ క్రీడాభిమానులను కనులవిందు చేసింది. సరిగ్గా శతాబ్దం తర్వాత విశ్వక్రీడలకు ఆతిథ్యమిస్తున్న పారిస్ ను కలకాలం గుర్తుంచుకునే రీతిలో వేడుకలు అలరించాయి. దిగ్గజ ఫుట్ బాలర్ జినేదిన్ జిదానే చేతబూనిన ఒలింపిక్ టార్చ్ వీడియోతో మొదలై నదిపై ప్లేయర్ల మార్చ్ ఫాస్ట్ తో ప్రారంభ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు మొదలైన ఆరంభ వేడుకలు ఆసాంతం కనువిందు చేశాయి.
PV Sindhu, Sharath Kamal carry India's flag at Paris Olympics 2024 opening ceremony on River Seine.#Gold #TeamIndia pic.twitter.com/Xt8ZFKBqPj
— Daily News India (@DNI_official_X) July 27, 2024
గ్రీస్ కు గౌరవార్థంగా పరేడ్ లో ముందు అవకాశం
ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్ కు గౌరవార్థంగా పరేడ్ లో ముందు అవకాశం ఇచ్చారు. రెండో స్థానంలో శరణార్థుల ఒలింపిక్ టీమ్ వచ్చింది. 84వ దేశంగా భారత్ పరేడ్ నిర్వహించింది. టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్స్ గా వ్యవహరించారు. అధికారులు, అథ్లెట్లు మొత్తం 78 మంది ఈ పరేడ్ లో పాల్గొన్నారు. వీరంతా ఈ ఆరంభ వేడుకల కోసం రూపొందించిన ప్రత్యేకమైన సంప్రదాయ దుస్తులను ధరించారు. ప్రతీ ఒక్కరు మువ్వెన్నెల జెండాను చేత పట్టుకొని అభివాదం చేశారు. భారత సంస్కృతి ప్రతిబింబించేలా అథ్లెట్లు మహిళా అథ్లెట్లు చీరకట్టులో ఆకట్టుకున్నారు. పురుష అథ్లెట్లు షెర్వానీలో మెరిసారు. ఈ ఆరంభ వేడుకలను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సెన్ నదీ వెంబడి భారీ సంఖ్యలో హాజరై ఆరంభ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. వర్షం పడినా.. ఆరంభ వేడుకలు ఆగలేదు. భారత్ నుంచి మొత్తం 117 మంది పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచారు. 16 ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.