Hyderabad: బీపీ ఎక్కువై చనిపోయిన భర్త, విషాదాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య, హైదరాబాద్ లో ఘటన

గచ్చిబౌలిలో ప్రైవేటు ఉద్యోగం చేసే అమన్‌కుమార్‌ సింగ్‌ గత నెల 26న రాత్రి ఒక్కసారిగా బీపీ ఎక్కువై బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందాడు. అప్పటి నుంచి 15 రోజులుగా అస్మిత మానసిక వేదనను అనుభవించింది. భర్త ఫొటోను దగ్గర పెట్టుకొని బాధపడింది. చివరికి మనస్తాపంతో మంగళవారం సాయంత్రం ఆరాంఘర్‌ కాలనీలోని పుట్టింట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Hyderabad: బీపీ ఎక్కువై చనిపోయిన భర్త, విషాదాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య, హైదరాబాద్ లో ఘటన
Representational Image (File Photo)

Hyderabad, JAN 10: హైదరాబాద్‌ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల అకస్మాత్తుగా రక్తపోటు ఎక్కువై భర్త హఠాన్మరణం పాలవడాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరణంతో తీవ్రంగా కుంగిపోయి చివరికి ఉసురు తీసుకుంది. మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రహీంపురాకు చెందిన అమన్‌కుమార్‌ సింగ్ ‌(36), అప్పర్‌ ధూల్‌పేట ఆరాంఘర్‌ కాలనీకి చెందిన అస్మిత (31) భార్యాభర్తలు. వీరికి రోనక్‌, రిత్విక్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గచ్చిబౌలిలో ప్రైవేటు ఉద్యోగం చేసే అమన్‌కుమార్‌ సింగ్‌ గత నెల 26న రాత్రి ఒక్కసారిగా బీపీ ఎక్కువై బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందాడు.

Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్, ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టిన ట్రైన్, 50 మందికి గాయాలు 

అప్పటి నుంచి 15 రోజులుగా అస్మిత మానసిక వేదనను అనుభవించింది. భర్త ఫొటోను దగ్గర పెట్టుకొని బాధపడింది. చివరికి మనస్తాపంతో మంగళవారం సాయంత్రం ఆరాంఘర్‌ కాలనీలోని పుట్టింట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

(The above story first appeared on LatestLY on Jan 10, 2024 09:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).