Hyderabad Shocker: శ్మశానంలో యువతిపై అన్నదమ్ములు గ్యాంగ్ రేప్, ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఛత్రినాక పోలీసులు
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. శ్మశానవాటికలో యువతిపై సామూహిక లైంగికదాడికి (young woman raped) పాల్పడిన ఇద్దరిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.
Hyd, Nov 1: హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. శ్మశానవాటికలో యువతిపై సామూహిక లైంగికదాడికి (young woman raped) పాల్పడిన ఇద్దరిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఛత్రినాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీఎం చావునీకి చెందిన ఇబ్రహీంబేగ్ (24), ఉమర్ బేగ్(20) అన్నదమ్ముల పిల్లలు. స్థానికంగానే ఉండే మతిస్థిమితం లేని ఓ మహిళ (30)తో ఇబ్రహీంకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకొని ఆమెపై లైంగిక దాడి చేద్దామని అన్నదమ్ములు పథకం రచించారు.
ఈ క్రమంలోనే ఇబ్రహీం శనివారం యువతిని పిలిపించుకొని బైక్‌పై తిప్పుతూ జీఎం చావునీలో ఓ శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. అనంతరం ఉమర్‌కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
(The above story first appeared on LatestLY on Nov 01, 2022 11:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

