Byju’s Layoffs: మళ్లీ లేఆఫ్స్ కలకలం, 3500 మంది ఉద్యోగులను తీసేస్తున్న బైజూస్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ లేఆప్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. నూతన భారత సీఈవో సారధ్యంలో పునర్వ్యవస్ధీకరణలో భాగంగా కంపెనీ మరో విడత ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా లేఆఫ్స్ ద్వారా 3500 మంది ఉద్యోగులపై వేటు పడనుందని చెబుతున్నారు.
- Read in
- తెలుగు
ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ లేఆప్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. నూతన భారత సీఈవో సారధ్యంలో పునర్వ్యవస్ధీకరణలో భాగంగా కంపెనీ మరో విడత ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా లేఆఫ్స్ ద్వారా 3500 మంది ఉద్యోగులపై వేటు పడనుందని చెబుతున్నారు.కంపెనీ ఇండియన్ న్యూ సీఈవో అర్జున్ మోహన్ నియామకం అనంతరం తాజా లేఆఫ్స్ తెరపైకి వచ్చాయి. ఈ లేఆఫ్స్‌లో సామర్ధ్యం అంచనాలను అందుకోలేని ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులపైనా వేటు పడనుందని సమాచారం.బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్‌పై లేఆఫ్స్ ప్రభావం పడనుండగా, ఆకాష్ ఇనిస్టిట్యూట్ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు. సేల్స్, మార్కెటింగ్ సహా పలు ఇతర విభాగాల్లోనూ కొలువుల కోత ఉంటుంది.
Here's News
Byju’s Layoffs: Edtech Major To Sack 4,000-5,000 Employees in Business Restructuring Exercise in Upcoming Weeks #Byjus #Layoffs #TechLayoffs https://t.co/mqeiOCBzTj
— LatestLY (@latestly) September 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 27, 2023 01:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

