Fitbit Recalls: ఆ స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే చేతులు కాలిపోతున్నాయ్! 17 లక్షల స్మార్ట్ వాచ్‌లను వెనక్కురప్పిస్తున్న గూగుల్ కంపెనీ, స్టార్ట్ వాచ్ కంపెనీ ఫిట్ బిట్ కు భారీ నష్టం
గూగుల్ కు చెందిన స్మార్ట్ వాచ్‌ల తయారీ కంపెనీ ఫిట్ బిట్ కు (Fitbit) ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీ తయారు చేసిన వాచ్‌ల్లో లోపం వల్ల బ్యాటరీ వేడెక్కి చేతులు కాలిపోతున్నాయి. దీంతో పది లక్షల వాచ్ లను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది(Fitbit Recalls ). దీంతో ఆ కంపెనీకి భారీగా నష్టం జరిగింది.
San Francisco, March 03: గూగుల్ కు చెందిన స్మార్ట్ వాచ్‌ల తయారీ కంపెనీ ఫిట్ బిట్ కు (Fitbit) ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీ తయారు చేసిన వాచ్‌ల్లో లోపం వల్ల బ్యాటరీ వేడెక్కి చేతులు కాలిపోతున్నాయి. దీంతో పది లక్షల వాచ్ లను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది(Fitbit Recalls ). దీంతో ఆ కంపెనీకి భారీగా నష్టం జరిగింది. ఒక్క అమెరికాలోనే (America) కాకుండా దీనిని కొనుగోలు చేసిన ఇతర దేశస్థులకు కూడా వాచ్ బ్యాటరీ వేడెక్కి చేతులు కాలడం(burning wearers), గాయాలవడం వంటి ఘటనలు నమోదయ్యాయి. అలా యూఎస్ కన్జూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ ఫిట్‌బిట్‌పై (US Consumer Product Safety Commission)అమెరికా నుంచి కనీసం 115మంది ఇతర దేశాల నుంచి 59మంది కంప్లైంట్ చేశారు. చాలా మందికి సెకండ్, థర్డ్ డిగ్రీ గాయాలు అవుతున్నాయని చెప్తున్నారు.
దీనిపై అధికారికంగా స్టేట్మెంట్ విడుదల చేసిన ఫిట్‌బిట్.. యూఎస్ కన్జూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ అనౌన్స్‌మెంట్ కు తాము 0.01 శాతం ఉత్పత్తులు మాత్రమే విక్రయించినట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ఫిట్‌బిట్ స్మార్ట్ వాచెస్, ట్రాకర్లతో ఇలాంటి ప్రమాదాలు జరగవని సర్ది చెప్పుకుంది.
అమెరికాలో పది లక్షల వాచ్ లు రీకాల్ చేస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా 6లక్షల 93వేల వాచ్ లను అమ్మారట. దీనిపై స్పందించిన నియంత్రణ కమిటీ Fitbit Ionic స్మార్ట్‌వాచ్‌ని వాడొద్దని చెప్పింది. వాళ్ల వాచ్ లు తిరిగిచ్చేసిన తర్వాత వాటికి రీఫండ్ దొరుకుతుందని స్పష్టం చేసింది.
(The above story first appeared on LatestLY on Mar 04, 2022 12:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

