Russia-Ukraine War: రష్యాకు భారీ షాక్ ఇచ్చిన ఆపిల్, అన్నీ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన
Apple (Photo Credits: Apple)

ప్రముఖ టెక్ దిగ్గజం, ప్రీమియం మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ కంపెనీ రష్యాకు భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో ఆపిల్ కంపెనీకి చెందిన అన్నీ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీ ప్రకటించింది. ఒక ప్రకటనలో ఆపిల్ "మేము రష్యాలో అన్ని ఉత్పత్తి అమ్మకాలను నిలిపిచేసాము. గత వారం, ఆ దేశానికి మా కంపెనీ ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేశాము" అని పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఆపిల్‌ కంపెనీ రష్యాలో ఆపిల్‌ పే, ఇతర సేవలను పరిమితం చేసినట్లు పేర్కొంది.

ఉక్రెయిన్‌పై దాడి రష్యా చేస్తున్న దాడుల కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి రష్యా దాడి చేసినప్పటి నుంచి అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు ఆ దాడిని ఆపడానికి మాస్కోపై అనేక ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్ రష్యన్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించాయి. కెనడా & స్వీడన్ కూడా రష్యా నుంచి వస్తున్న విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి.

యాపిల్ ఐఫోన్ 13 ల‌వ‌ర్స్‌కు శుభ‌వార్త‌, స్మార్ట్‌ఫోన్‌పై రూ.11,000 వరకు డిస్కౌంట్‌, అమెజాన్ లో బంపర్ ఆఫర్

పాశ్చాత్య మిత్రదేశాలు సమిష్టిగా రష్యాను ఒంటరి చేయడానికి ఆర్థిక ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. ఈ చర్యలలో భాగంగానే ఆ దేశ విదేశీ కరెన్సీ నిల్వలను స్తంభింపజేశాయి. ఇంకా రష్యన్ బ్యాంకులను స్విఫ్ట్ నెట్ వర్క్ నుంచి తొలిగించాయి. ఇలా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా చాలా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి.