Aug 2: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడ పోషకాలు అవసరం. అయితే ఇందులో కొన్ని సహజ సిద్ధంగా దొరికేవి అయితే మరికొన్ని కృత్రిమంగా లభిస్తాయి. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషించేంది రోగ నిరోధక శక్తి. ఇది బలహీన పడితే వ్యాధుల బారిన పడటం ఖాయం. శరీరంలోకి ప్రవేశించే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ వంటివాటిని నిర్మూలించి ఇమ్యూనిటీని పెంచుతుండంలో రోగ నిరోధక శక్తికి కీలక పాత్ర.

ఇక ముఖ్యంగా వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు అందరిని వేధిస్తుంటాయి. జలుబు, దగ్గు , డెంగ్యూ జ్వరం, మలేరియా, సీజనల్ ఫీవర్, టైఫాయిడ్ వంటి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ. అయితే ప్రకృతి ప్రసాదించిన కొన్ని పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం. వీటిలో ప్రధానంగా బత్తాయి, ఆరెంజ్, కివీ వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. దానిమ్మ ఇమ్యూనిటీ పెంచడానికి సాయ పడుతుంది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదు. కాబట్టి వర్షాకాలంలో సీజనల్‌గా వచ్చే పండ్లతో పాటు వీటిని కూడా మీ డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణుల సలహా.

బ్లూ బెర్రీలు... ఐరన్, ఫొలేట్, పొటాషియం, విటమిన్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వ్యాధులతో పోరాడటంలో సాయం చేస్తాయి. అలాగే లిచీ పండ్లు. వర్షాకాలంలో ఖచ్చితంగా తినాల్సిన పండ్లలో లిచీ ఒకటి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జలుబు నుండి త్వరితగతిన ఉపశమనం పొందేలా చేస్తుంది. నిద్రలేమి సమస్యా అయితే మీకు క్యాన్సర్ ముప్పు,అంతేగాదు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ! 

అలాగే పియర్స్ ఫ్రూట్. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కావాల్సిన విటమిన్లు అన్ని ఈ పండులో ఉన్నాయి. క్రమం తప్పకుండా వీటిని తింటే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం. చెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అంటు వ్యాధులను నివారిస్తాయి. మెదడుకు విశ్రాంతి, ప్రశాంతతను అందిస్తాయి.