Apple Company

Mumbai, July 24: ఆపిల్ ఐఫోన్ (I Phone) అభిమానులకు అదిరే న్యూస్.. రాబోయే రోజుల్లో ఐఫోన్లలో కూడా మడతబెట్టే ఫోన్లు రానున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ బట్టి స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఫోల్డబుల్ ఫోన్లను (Apple Foldable I Phone) తీసుకొచ్చేందుకు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాల్లో సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్, వన్‌ప్లస్, వివో లేదా ఇతర బ్రాండ్లు ఫోల్డుబల్ ఫోన్లను (Apple Foldable I Phone) మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే, ఐఫోన్‌తో అగ్రగామిగా ఉన్న ఆపిల్ ఈ విషయంలో కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో ఆపిల్ కూడా సొంత ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకు రానుందా? లేదా అనేదానిపై స్పష్టత లేదు. అసలు మడతబెట్టే ఐఫోన్లను ఎప్పుడు తీసుకువస్తుందనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. నివేదికలను విశ్వసిస్తే.. ఆపిల్ అభిమానులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆపిల్ 2026లో సొంత ఫోల్డబుల్ ఐఫోన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆపిల్ నుంచి ఈ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్.. శాంసంగ్, గెలాక్సీ ఫ్లిప్ మాదిరిగానే ఫ్లిప్-స్టైల్ డివైజ్‌గా వస్తుందని అంచనా.

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం లేకుండా భారీ ఫైల్స్‌ను షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం 

ఆసియా టుడే ప్రకారం.. కుపెర్టినో-ఆధారిత దిగ్గజం ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. తాత్కాలికంగా ఐఫోన్ ఫ్లిప్ (I Phone Flip) అని పేరు పెట్టారట. 2023లో ఈ కొత్త మడతబెట్టే ఐఫోన్ కోసం ఆపిల్ ఇప్పటికే పరిశోధన, అభివృద్ధి దశను ప్రారంభించిందని నివేదిక సూచిస్తుంది. ఆపిల్ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను 2026 విడుదల చేసే అవకాశం ఉందని నివేదికలు అంచనా వేస్తున్నాయి.

YouTube Down: మైక్రోసాప్ట్ క్రాష్ తర్వాత యూట్యూబ్ డౌన్, వీడియోలు అప్ లోడ్ కావడం లేదని గగ్గోలు పెడుతున్న నెటిజన్లు 

కొద్ది రోజుల క్రితమే ఆపిల్ కొత్త పేటెంట్ గురించి “మన్నికైన ఫోల్డింగ్ డిస్‌ప్లేలతో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు” అనే పేరుతో నివేదికలు బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. మన్నికైన ఫోల్డబుల్ గ్లాస్ డిస్‌ప్లేను రూపొందించడానికి ఆపిల్ ద్వంద్వ విధానాన్ని వెల్లడిస్తుంది. బెండ్ యాక్సెస్ వెంట గ్లాస్ లేయర్ పలచగా ఉండనుంది. అంటే.. కింద పడినప్పుడు ఈ గ్లాస్ పగిలిపోకుండా వంగిపోయేలా ఉంటుంది.