మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ సహాయంతో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే భారీ ఫైల్స్‌ను షేర్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్‌పై పని చేస్తుందని వాట్సాప్ ట్రాకర్ వాబీఇన్ఫో (WABetaInfo) తెలిపింది. ఆపిల్ అప్లికేషన్, ఎయిర్ డ్రాప్, గూగుల్ నియర్‌బై షేర్ తరహాలోనే పని చేస్తుందని పేర్కొంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వీడియోలు, ఫొటోలు, ఇతర భారీ ఫైల్స్‌ను ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు షేర్ చేయవచ్చని తెలిపింది. గుడ్ న్యూస్, ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించిన కేంద్ర ఆర్థికమంత్రి
తొలుత ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానున్నది. ఆ తర్వాత ఐఓఎస్ యూజర్లకు సైతం విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.రెండు మొబైల్స్ నుంచి ఫైల్స్‌ను పంపేందుకు స్కానర్ ఉంటుంది. ఆ తర్వాత రెండుఫోన్లు కనెక్ట్ అయ్యాక ఫైల్స్‌ను సెండ్ చేసుకోవచ్చు. ఫైల్స్‌ను సెండ్ చేసుకునేందుకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఉండదని పేర్కొంది.