Google Birthday 2023: గూగుల్ 25వ జన్మదినం నేడు, గూగుల్ డూడుల్ ద్వారా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్న టెక్ దిగ్గజం, వీడియో ఇదిగో..
గూగుల్ (Google) 25వ జన్మదినం నేడు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగుల్ డూడుల్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటోంది.సరిగ్గా పాతిక సంవత్సరాల కిందట అంటే 1998 సెప్టెంబర్ 4వ తేదీన గూగుల్ ఆవిర్భవించింది. అయితే, గూగుల్ తన పుట్టినరోజును ఏటా సెప్టెంబర్ 27వ తేదీన జరుపుకుంటోంది
- Read in
- తెలుగు
గూగుల్ (Google) 25వ జన్మదినం నేడు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగుల్ డూడుల్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటోంది.సరిగ్గా పాతిక సంవత్సరాల కిందట అంటే 1998 సెప్టెంబర్ 4వ తేదీన గూగుల్ ఆవిర్భవించింది. అయితే, గూగుల్ తన పుట్టినరోజును ఏటా సెప్టెంబర్ 27వ తేదీన జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భానికి గుర్తుగా ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శించింది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత గూగుల్ డూడుల్ మారిపోయింది.
Google స్థానంలో తన 25వ వార్షికోత్సవాన్ని తెలియజేస్తూ G25gle అనే అక్షరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఈ డూడుల్ ఆకట్టుకుంటోంది.అమెరికాకు చెందిన లారీ పేజ్, సర్జీ బ్రిన్ స్టోన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థులుగా ఉన్నప్పుడు 1998 సెప్టెంబర్ 4న ఈ సంస్థను స్థాపించారు. గూగుల్ మొదటి ఏడేళ్లు సెప్టెంబర్ 4నే వార్షికోత్సవం నిర్వహించింది. కానీ, రికార్డుల ఆధారంగా 2005 నుంచి సెప్టెంబర్ 27కి మార్చింది.

Here's Video
Looking back at some birthday doodles as we look forward to celebrating our 25th birthday tomorrow 🥹🎂#GoogleDoodle pic.twitter.com/htqszNy5da
— Google India (@GoogleIndia) September 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 27, 2023 01:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

