Uber Ride via WhatsApp: వాట్సాప్ ద్వారా ఉబెర్ క్యాబ్ బుకింగ్ ఇలా చేసుకోండి, ప్రపంచంలోనే తొలిసారిగా భారత్‌లో ఊబెర్ కొత్త ఫీచర్, ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా లక్నోలో అమలు

ప్రస్తుతం మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే క్యాబ్ బుక్ చేసుకుంటుంటాం. అయితే దీని కోసం ఉబర్ యాప్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అయితే, ఉబెర్ యాప్ లేకుండా ఫ్రెండ్ కు మెసేజ్ చేసినంత సులువుగా క్యాబ్ ను బుక్ చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు వాట్సాప్ కల్పిస్తోంది.

Uber Ride via WhatsApp: వాట్సాప్ ద్వారా ఉబెర్ క్యాబ్ బుకింగ్ ఇలా చేసుకోండి, ప్రపంచంలోనే తొలిసారిగా భారత్‌లో ఊబెర్ కొత్త ఫీచర్, ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా లక్నోలో అమలు
WhatsApp & Uber (Photo Credits: Facebook, Pixabay)

ప్రస్తుతం మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే క్యాబ్ బుక్ చేసుకుంటుంటాం. అయితే దీని కోసం ఉబర్ యాప్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అయితే, ఉబెర్ యాప్ లేకుండా ఫ్రెండ్ కు మెసేజ్ చేసినంత సులువుగా క్యాబ్ ను బుక్ చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు వాట్సాప్ కల్పిస్తోంది. యాప్ అవసరం లేకుండానే ‘వాట్సాప్’లో క్యాబ్ ను బుక్ (Uber Ride via WhatsApp) చేసుకునే అవకాశం కల్పించింది. ఉబెర్ అఫీషియల్ చాట్ బోట్ తో కనెక్ట్ అయి క్యాబ్ ను బుక్ చేసుకునే వీలును (Uber Ride via WhatsApp in India) ఉబెర్ కంపెనీ కల్పించింది.

ఈ ఫీచర్ ను ప్రపంచంలోనే భారత్ లో తొలిసారి తీసుకొస్తున్నట్టు ఉబెర్ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి బుకింగ్ దాకా అన్ని వాట్సాప్ తోనే జరిగిపోతాయని ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కేవలం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోనే దీనిని అమలు చేయనున్నారు. త్వరలోనే మిగతా నగరాలకూ కూడా దీనిని విస్తరించనున్నారు. ప్రస్తుతం ఇంగ్లిష్ లోనే అందుబాటులో ఉన్నా.. త్వరలో మిగతా భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

వాట్సాప్ లో ఉబెర్ క్యాబ్ బుకింగ్ ఇలా చేసుకోవాలి..

వాట్సాప్ ద్వారా మూడు రకాలుగా క్యాబ్ ను బుక్ చేసుకునే అవకాశాన్ని ఉబెర్ కల్పించింది. మొదటి దానిలో ఉబెర్ బిజినెస్ అకౌంట్ నంబర్ కు మెసేజ్ పంపించడం ద్వారా, రెండవది క్యూర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా, మూడవది ఊబెర్ వాట్సాప్ చాట్ కు కనెక్ట్ చేసే లింక్ ను క్లిక్ చేయడం ద్వారా క్యాబ్ ను బుక్ చేసుకోవచ్చు. మూడింట్లో ఏదో ఒక పద్ధతిని ఎంపిక చేసుకున్న తర్వాత.. పికప్, డ్రాప్ లొకేషన్లను అడుగుతుంది. ఆ వెంటనే అక్కడకు వెళ్లేందుకు అయ్యే చార్జీని, డ్రైవర్ రావడానికి పట్టే టైంను వెల్లడిస్తుంది.

ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నారా.. గూగుల్ అలర్ట్ మెసేజ్ చూడండి, జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించిన గూగుల్

యాప్ లో ఉండే అన్ని సౌకర్యాలను వాట్సాప్ బుకింగ్ ద్వారా కూడా ఊబెర్ అందించనుంది. భద్రత, బీమా వంటి వసతులను సమకూర్చనుంది. యాప్ లో ఉండే భద్రతా ఫీచర్లనే వాట్సాప్ బుకింగ్ లోనూ పెడుతుంది. బుకింగ్ సమయంలో డ్రైవర్ పేరు, లైసెన్స్ ప్లేట్ వివరాలను యూజర్ కు తెలియజేస్తుంది. భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు వాట్సాప్ చాట్ లో ఊబెర్ అందిస్తుంటుంది. ఎమర్జెన్సీ సమయాల్లో ఊబెర్ కు ఫిర్యాదు చేసే సమాచారాన్ని ఇస్తుంది. ప్రయాణ సమయంలో ఎమర్జెన్సీ ఆప్షన్ ను క్లిక్ చేస్తే.. వెంటనే ఊబెర్ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ వస్తుంది. ప్రయాణం ముగిసిన తర్వాత అరగంటదాకా యూజర్లకు ఊబెర్ సేఫ్టీ లైన్ నంబర్ అందుబాటులో ఉంటుంది.

(The above story first appeared on LatestLY on Dec 02, 2021 02:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).