Intel: టెక్ దిగ్గజం ఇంటెల్ షాకింగ్ నిర్ణయం, బెంగుళూరు ఆఫీసును అమ్మేందుకు బిడ్డింగ్ ఆహ్వానం, ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ మోడల్ అమలు
టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని బెంగళూరు ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 250,000 స్కైర్ ఫీట్ కార్యాలయాన్ని ఇంటెల్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
Intel planning to sell its Bengaluru office: టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని బెంగళూరు ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 250,000 స్కైర్ ఫీట్ కార్యాలయాన్ని ఇంటెల్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. రూ.450 కోట్ల విలువైన ఆఫీస్ బిల్డింగ్‌ను అమ్మేందుకు కొనుగోలు దారుల్ని బిడ్డింగ్ ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
అమ్మకం పూర్తయిన తర్వాత అదే ఆఫీస్ కార్యాలయాన్ని మూడేళ్ల పాటు ఇంటెల్ లీజుకు తీసుకోనుంది. ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అమలు చేయనుంది.బెంగళూరు ఇంటెల్ కార్యాలయంలో 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వారు ఉన్నారు.
కోవిడ్ కారణంగా చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో పర్సనల్ కంప్యూటర్లకు గిరాకీ అమాంతం పెరిగింది. కంపెనీలు తిరిగి తెరుచుకుంటుండడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పీసీలకు గిరాకీ పడిపోయింది. వెరసీ ఆ ప్రభావం ఇంటెల్ క్యూ1 ఫలితాల పడింది. ఇంటెల్ ప్రతి షేర్ ఆదాయంలో 133 శాతం వార్షిక తగ్గింపు నమోదు కాగా, ఆదాయం సంవత్సరానికి దాదాపు 36 శాతం పడిపోయి 11.7 బిలియన్లకు పడిపోయిందని సీఎన్‌బీసీ నివేదిక తెలిపింది.ఈ పరిణామాలతో ఇంటెల్ ఎంత వీలైతే అంతే ఖర్చును తగ్గించుకుంటుంది.
(The above story first appeared on LatestLY on Jun 26, 2023 05:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

