IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్ చేస్తున్నారా.. అయితే టిక్కెట్ బుకింగ్ ప్రక్రియలో మార్పులు గురించి మీరు తెలుసుకోవాల్సిందే

ఐఆర్‌సీటీసీ వినియోగదారులు తమ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకునే ముందు వారి ఫోన్ నంబర్‌లు మరియు ఈ-మెయిల్ ఐడీలను ధృవీకరించడం తప్పనిసరి చేసింది.

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్ చేస్తున్నారా.. అయితే టిక్కెట్ బుకింగ్ ప్రక్రియలో మార్పులు గురించి మీరు తెలుసుకోవాల్సిందే
RCTC Website (Photo Credits: File Photo)

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ లేదంటే యాప్‌ని ఉపయోగించి రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకుల కోసం.. టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను సవరించింది. ఐఆర్‌సీటీసీ. ఇకపై ఐఆర్‌సీటీసీ వినియోగదారులు తమ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకునే ముందు వారి ఫోన్ నంబర్‌లు మరియు ఈ-మెయిల్ ఐడీలను ధృవీకరించడం తప్పనిసరి చేసింది. ఈ యాప్‌ అప్లికేషన్ గూగుల్‌ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్‌ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుందన్నది తెలిసిందే. ఇక మీదట.. వెరిఫికేషన్ లేకుండా కస్టమర్లు టిక్కెట్లు బుక్ చేసుకోలేరని IRCTC స్పష్టం చేసింది. అయితే COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చేయని వారికి కొత్త నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఫోన్ నంబర్ , ఈ-మెయిల్‌ ఐడీని ఎలా ధృవీకరించవచ్చో చూద్దాం.. ముందుగా ఐఆర్‌సీటీసీ యాప్‌ లేదంటే వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ వెరిఫికేషన్‌ విండో కనిపిస్తుంది. అందులో మొబైల్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీని ఎంటర్‌ చేయాలి.కుడి వైపు వెరిఫికేషన్‌.. ఎడమ వైపు ఎడిట్‌ బటన్‌ కనిపిస్తాయి.వివరాలను పొందుపరిచాక.. వన్‌ టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ) మొబైల్‌ నెంబర్‌ లేదంటే మెయిల్‌ ఐడీకి వస్తుంది.ఆపై వెరిఫై ద్వారా ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఈ మూడు విషయాలు వెతికితే జైలుకే, సైబర్ క్రైం పోలీసులు వెంటనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళతారు, అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి

వెరిఫికేషన్‌ తర్వాత..

ఐఆర్‌సీటీసీ పోర్టల్‌ లేదా యాప్‌కు వెళ్లి లాగిన్‌ కావాలి. స్టేషన్‌, తేదీ, ఇతర వివరాలను ఎంటర్‌ చేయాలి. బుక్‌ నౌ మీద క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ప్రయాణికుల వివరాలు.. ఇతర వివరాలు పొందుపర్చాలి. పేమెంట్‌ ఆప్షన్‌ పూర్తయ్యాక.. అప్పుడు కన్ఫర్మేషన్‌ వివరాలు వస్తాయి.

(The above story first appeared on LatestLY on May 17, 2022 12:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).