ISRO New Plan: రాకెట్ల తయారీకి గుడ్‌బై చెబుతున్న ఇస్రో.. పరిశోధనలపై దృష్టి సారించనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన చరిత్రలోనే అతిపెద్ద నిర్మాణాత్మక పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రాకెట్లు, సాధారణ ఉపగ్రహాల తయారీ వంటి సాంప్రదాయ పనులను స్వయంగా నిర్వహించిన ఇస్రో.. ఇకపై ఆ బాధ్యతలను క్రమంగా ప్రైవేట్ రంగానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు బదిలీ చేయనుంది.

PSLV C-59 rocket launch postponed(ISRO X)

ISRO New Plan: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన చరిత్రలోనే అతిపెద్ద నిర్మాణాత్మక పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రాకెట్లు, సాధారణ ఉపగ్రహాల తయారీ వంటి సాంప్రదాయ పనులను స్వయంగా నిర్వహించిన ఇస్రో.. ఇకపై ఆ బాధ్యతలను క్రమంగా ప్రైవేట్ రంగానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు బదిలీ చేయనుంది. ఈ చారిత్రాత్మక మార్పు ద్వారా ఇస్రో పూర్తిగా పరిశోధన, అభివృద్ధి (R&D), అధునాతన అంతరిక్ష సాంకేతికతలు, సుదూర శాస్త్రీయ ప్రయోగాలు , మౌలిక సదుపాయాల కల్పనపై మాత్రమే తన దృష్టిని కేంద్రీకరించనుంది.

ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ఛైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకా ఒక మీడియా కార్యక్రమంలో ఈ కీలక విషయాలను వెల్లడించారు. ఈ పరివర్తన ప్రక్రియలో భాగంగా, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) సాంకేతికత , ఉత్పత్తి హక్కులను బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)కు ఇప్పటికే అప్పగించారు.

ఇంజినీరింగ్‌ను 18 ఏళ్లకే వదిలేశాడు.. ఇప్పుడు విశ్వంలోని తొలి బ్లాక్‌హోల్స్ రహస్యాలను ఛేదిస్తున్నాడు..

రాబోయే దశల్లో భారతదేశపు అత్యంత శక్తివంతమైన రాకెట్లైన లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM3) , పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) నిర్మాణాన్ని కూడా పూర్తిగా ప్రైవేట్ కంపెనీలకే అప్పగించనున్నారు. ఈ భారీ రాకెట్ల తయారీ ప్రక్రియలో ప్రభుత్వ రంగ సంస్థలకు పాల్గొనేందుకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, రాబోయే నాలుగు నుంచి ఐదు నెలల వ్యవధిలో ఒక కొత్త ప్రయోగ కేంద్రాన్ని నిర్వహించేందుకు ఒక ప్రైవేట్ ఆపరేటర్‌ను ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

దేశీయ అంతరిక్ష రంగాన్ని వాణిజ్యపరంగా బలోపేతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఇస్రో ఇప్పటివరకు దాదాపు 120 సాంకేతిక పరిజ్ఞానాలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేసింది. దీనివల్ల ప్రైవేట్ కంపెనీలు తమ సొంత ఉపగ్రహాలను నిర్మించుకుని, ఉపగ్రహ డేటా , విభిన్న సేవల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే వాణిజ్య నమూనా ప్రోత్సహించబడుతుంది.

ఈ మార్పుల ద్వారా 2033 నాటికి భారతదేశపు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత 8 బిలియన్ డాలర్ల నుండి 44 బిలియన్ డాలర్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరివర్తన ఇప్పటికే ప్రారంభమైందని, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో భారత అంతరిక్ష రంగం ప్రపంచ స్థాయిలో మరిన్ని మైలురాళ్లను సాధిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement