ITR Filing: లాస్ట్ డేట్ ముంచుకొస్తోంది! గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఎంత జరిమానా విధిస్తారో తెలుసా? ఈ స్టెప్స్ ఫాలో అయితే ఐటీ రిటర్న్ ఫైల్ చేయడం చాలా ఈజీ

సాధ్యమైనంత త్వరగా ఫైల్ చేయండి. ఒకవేళ మీరు ఐటీఆర్ గడువు (ITR Last Date) లోపు ఫైల్ చేయకపోతే లేట్ ఫీజు రూపంలో రూ.5000 చెల్లించాల్సి వస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్‌లో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

ITR Filing: లాస్ట్ డేట్ ముంచుకొస్తోంది! గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఎంత జరిమానా విధిస్తారో తెలుసా? ఈ స్టెప్స్ ఫాలో అయితే ఐటీ రిటర్న్ ఫైల్ చేయడం చాలా ఈజీ
It Returns Filing (PIC@ Pixabay)

New Delhi, July 16: గత ఆర్థిక సంవత్సరం (ప్రస్తుత అంచనా సంవత్సరం 2023-24) ఇన్‌‌కం టాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఈ పరిస్థితుల్లో మీరు ఇప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయకుంటే.. సాధ్యమైనంత త్వరగా ఫైల్ చేయండి. ఒకవేళ మీరు ఐటీఆర్ గడువు (ITR Last Date) లోపు ఫైల్ చేయకపోతే లేట్ ఫీజు రూపంలో రూ.5000 చెల్లించాల్సి వస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్‌లో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంటివద్ద నుంచే మీరు ఐటీఆర్ ఫైల్ చేయడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

PIB Fact Check: స్మార్ట్‌ఫోన్‌ కొంటే కేంద్రం రూ.10,200 మీ అకౌంట్లో జమ చేస్తుంది అంటూ వార్త వైరల్, ఇటువంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని కోరిన PIB 

తొలుత మనమంతా ఆదాయం పన్ను విభాగం అధికారిక వెబ్‌సైట్ (https :// incometax.gov.in/iec/foservices/#/login) లోకి వెళ్లి అక్కడ అడిగిన సమాచారం నమోదు చేయాలి.

ఆదాయం పన్ను విభాగం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత మీ యూజర్ ఐడీ ( అప్పటికీ ఐటీ పోర్టల్‌లో మీ పేరు రిజిస్టర్ కాకపోతే, తొలుత రిజిస్టర్ చేసుకోవాలి) నింపి.. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అటుపై పాస్ వర్డ్ నమోదు చేసి లాగిన్ కావాలి.

లాగిన్ అయిన తర్వాత ఓపెన్ అయిన పేజీలో ఈ-ఫైల్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ (IT Returns) ఆప్షన్ ఫైల్ ఎంచుకోవాలి. అంచనా సంవత్సరం (2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేస్తే.. 2023-24 అంచనా సంవత్సరం) నమోదు చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి.

ఆఫ్‌లైన్‌లోనూ, ఆన్ లైన్‌ ఆప్షన్ ఎంచుకుని ఐటీఆర్ ఫైలింగ్ చేయొచ్చు. ఆన్‌లైన్‌ ఆప్షన్ ఎంచుకున్నాక.. ‘పర్సనల్’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు మీరు ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-4 వరకు ఏదో ఒక ఆప్షన్ ఎంచుకుని కంటిన్యూ క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీరు వేతన జీవులైతే ఐటీఆర్-1 ఫామ్ సెలెక్ట్ చేసుకుని.. మీ కంప్యూటర్‌లో డౌన్ లోడ్ చేసుకోవాలి. ‘ఫైలింగ్ టైప్’లోకి వెళ్లి 139 (1) సెలెక్ట్ చేసి – వర్జినల్ రిటర్న్’లోకి వెళ్లాలి.

దీని తర్వాత మీరు డౌన్ లోడ్ చేసుకున్న ఐటీఆర్-1 ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో బ్యాంకు ఖాతా సమాచారం, ఫోన్ నంబర్, తదితర అన్ని రకాల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి.

Discounts on Smartphones: స్మార్ట్‌‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, Xiaomi 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ తగ్గింపులు, ఆఫర్ ఎప్పటివరకంటే.. 

ఒకవేళ ఆఫ్‌లైన్‌ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే డౌన్ లోడ్ చేసుకున్న ఫామ్‌లో సమాచారం నింపిన తర్వాత అటాచ్ ఫైల్ ఆప్షన్‌లోకి వెళ్లి అడిగిన డాక్యుమెంట్లు అటాచ్ చేయాలి.

అడిగిన డాక్యుమెంట్లు అటాచ్ చేసిన తర్వాత ఐటీ పోర్టల్.. వాటిని వాల్యుడేట్ చేస్తుంది. వాల్యుడేషన్ పూర్తయిన తర్వాత ‘ప్రొసీడ్ టూ వెరిఫికేషన్’ మీద క్లిక్ చేయాలి.

వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత.. ఐటీఆర్ స్టేటస్ మీద క్లిక్ చేసి, ఎకనాలెడ్జ్‌మెంట్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేస్తే.. మీ అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది.

(The above story first appeared on LatestLY on Jul 16, 2023 09:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).