Xiaomi 9th Anniversary Sale 2023 (Photo-Twitter)

Xiaomi 9th Anniversary Sale 2023: ఎలక్ట్రానిక్‌ తయానీ దిగ్గజం షియోమి (Xiaomi) 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్‌ సేల్‌ను ప్రారంభించింది. జూలై 6 నుంచి జూలై 10 వరకూ ఈ డిస్కౌంట్ సేల్‌ కొనసాగుతుంది.ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లపై 50 శాతం, స్మార్ట్‌ టీవీలపై 60 శాతం, ఇతర లైఫ్‌స్టైల్‌ వస్తువులపై 80 శాతం తగ్గింపు అందిస్తోంది. అలాగే ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్లపైనా భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

కంపెనీ నేరుగా ఇచ్చే డిస్కౌంట్లతో పాటు ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులు రూ.8,000, మొబిక్విక్‌ వ్యాలెట్‌ యూజర్లు 20 శాతం క్యాష్‌బ్యాక్‌, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులు రూ.3,000 వరకూ తక్షణ తగ్గింపు పొందవచ్చు.

డేటా గోప్యత లేదు, విడుదలకు ముందే మెటా థ్రెడ్‌ యాప్‌కు ఎదురుదెబ్బ, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందన ఇదిగో..

అంతేకాకుండా ‘షియోమీ టర్న్స్‌ 9’ సేల్‌లో కస్టమర్లకు యాడ్‌ఆన్‌ బోనస్‌లు కూడా లభిస్తాయి.‘షియోమి టర్న్స్ 9’ సేల్‌లో ఎంఐ ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఎంఐ స్క్రీన్ ప్రొటెక్ట్, ఎంఐ కంప్లీట్ ప్రొటెక్ట్ వంటి అన్ని ఎంఐ డివైజ్‌ కేర్‌ ప్లాన్‌లపైనా ఫ్లాట్ 25 శాతం తగ్గింపు వర్తిస్తుంది.

‘లక్కీ 9 షాపర్స్‌’ కాంటెస్ట్‌ విజేతలు వందశాతం తగ్గింపు అంటే ఉచితంగా ఆయా ఉత్పత్తులు సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటుగా మధ్యాహ్నం 12 నుంచి గంటపాటు ఉండే ‘డైలీ 9 స్టోర్’ సేల్‌లో ఎంపిక చేయబడిన వస్తువులపై అద్భుతమైన ఆఫర్‌లు ఉన్నాయి.

షియోమీ స్మార్ట్‌ఫోన్లపై టాప్‌ ఆఫర్లు ఇవే..

షియోమి 13 ప్రో (Xiaomi 13 Pro): రూ. 20,000 ఫ్లాట్ తగ్గింపు తర్వాత రూ. 69,999 ధరకు అందుబాటులో ఉంటుంది. దీని అసలు ధర రూ. 89,999.

షియోమి 12 ప్రో (Xiaomi 12 Pro): అసలు ధర రూ.79,999 కాగా దాదాపు రూ. 39,999 తగ్గింపు తర్వాత రూ. 40,000 లకే సొంతం చేసుకోవచ్చు.

రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5జీ (Redmi Note 12 Pro 5G): రూ. 20,499 లకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.27,999.