ట్విటర్ తరహాలో థ్రెడ్స్‌ పేరుతో యాప్‌ను లాంఛ్‌ చేస్తున్నట్లు మెటా ప్రకటించిన సంగతి విదితమే.అయితే విడుదలకు ముందే ఆ యాప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. యూజర్ల డేటా విషయంలో భద్రత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్లో స్పందించారు. ఇయాన్ జెల్బో అనే నెటిజన్‌.. ఆశ్చర్యం పోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ట్విటర్‌ ప్రత్యర్ధి మెటా మన డేటాను కలెక్ట్‌ చేస్తుందంటూ కొన్ని ఆధారాలు చూపిస్తూ వాటిని ట్వీట్‌ చేశాడు.ఆ ట్వీట్‌లకు మస్క్‌ తనదైన శైలిలో స్పందించారు. కృతజ్ఞత, వాళ్లు చాలా తెలివిగా నడుచుంటున్నారని పేర్కొన్నారు. మరి థ్రెడ్స్‌ విడుదల, డేటా గోప్యతపై మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ స్పందించాల్సి ఉంటుంది.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)