Chandrayaan 3 Landing: అన్ని స్కూళ్లూ, కాలేజీల్లో చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్షప్రసారం, ప్రభుత్వం పాఠశాలల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్ నిర్ణయం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం చుంద్రుడిపై దిగనుంది. ఈ ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందా, లేదా అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 చందమామపై దిగే అద్భుతాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Hyderabad, AUG 22: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం చుంద్రుడిపై దిగనుంది. ఈ ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందా, లేదా అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 చందమామపై దిగే అద్భుతాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల కోసం లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో డీఈవోలకు, ప్రిన్సిపల్స్‌కు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు తెలంగాణ విద్యా ఛానెల్స్ అయిన టీ శాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.
Chandrayaan-3 Mission:
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.
The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!
The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY
— ISRO (@isro) August 22, 2023
ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేక స్క్రీన్‌లు, ప్రొజెక్టర్‌లను సిద్ధం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి టీ శాట్, నిపుణ ఛానెళ్లలో లైవ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై దిగనుంది.
(The above story first appeared on LatestLY on Aug 22, 2023 08:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

