Flipkart

వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రానున్న పండగ సీజన్‌లో లక్షకు పైగా సీజనల్ ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ మేరకు కంపెనీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది.కిరాణా డెలివరీ ప్రోగ్రామ్ ద్వారా పండుగ ఈవెంట్‌లో 40శాతం కంటే ఎక్కువ షిప్‌మెంట్‌లను డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తోందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలాగే పండుగల సీజన్‌లో వేలాది మందికి నైపుణ్యం , శిక్షణ అవకాశాలు కల్పించినట్టు చెప్పింది.

ఈ ఉద్యోగాలు తమ సప్లై చెయిన్‌లో ఉంటాయని కంపెనీ పేర్కొంది, ఇందులో ఫుల్‌ఫెల్‌మెంట్ సెంటర్‌లు, సార్టేషన్ సెంటర్‌లు, డెలివరీ హబ్‌లు ఉన్నాయి. లాజిస్టిక్స్‌కు సహాయం చేయడానికి డెలివరీ భాగస్వాముల జాబ్స్‌ కూడా ఉంటాయి. సరఫరా గొలుసులో లక్షకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తున్నమని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ రీకామర్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , సప్లై చెయిన్ హెడ్ హేమంత్ బద్రీ తెలిపారు.

జాబిల్లిపై స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయిన ప్రజ్ఞాన్‌ రోవర్, సెప్టెంబర్ 22 వరకు చీకట్లో చంద్రుడి దక్షిణ ధృవం, సూర్య కాంతి వస్తేనే స్లీప్ మోడ్ నుంచి ఆన్

ఉద్యోగాల ‍ కల్పనతో పాటు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అంతటా 19 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలాన్ని జోడించాలని యోచిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా తమ గుర్తింపును మరింత బలోపేతం చేయడం ద్వారా ఉన్నతమైన కస్టమర్ అనుభవాన్ని అందించడానికి నైపుణ్యం కలిగిన కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టామని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ హబ్‌లు, పెద్ద-స్థాయి నెరవేర్పు కేంద్రాలు, టైర్-III నగరాలు, బయట కూడా మరింత బలపడనున్నామనే సంకేతాలందించారు.