PM Modi YouTube Channel: 2 కోట్ల సబ్‌స్క్రైబర్లుతో ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ అరుదైన ఘనత, ప్రపంచలో తొలి దేశాధినేతగా సరికొత్త రికార్డు
ప్రధాని మోదీ నేడు మరో అరుదైన ఘనత సాధించారు. వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్‌కు (Personal Youtube Channel) 2 కోట్ల పైచిలుకు మంది సబ్‌స్క్రైబర్లు (2 Crore subscribers) కలిగిన తొలి దేశాధినేతగా రికార్డు సృష్టించారు.
ప్రధాని మోదీ నేడు మరో అరుదైన ఘనత సాధించారు. వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్‌కు (Personal Youtube Channel) 2 కోట్ల పైచిలుకు మంది సబ్‌స్క్రైబర్లు (2 Crore subscribers) కలిగిన తొలి దేశాధినేతగా రికార్డు సృష్టించారు. ప్రధాని తరువాతి స్థానంలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారోకు (Jair Bolsonaro) కేవలం 64 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉండటంతో మోదీ సాధించిన ఫీట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అత్యధిక యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు కలిగిన రాజకీయనేతల్లో మోదీ, బోల్సోనారో తరువాతి స్థానాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆక్రమించారు. ఆయనకు 1.1 మిలియన్ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. డిసెంబర్‌లో ప్రధాని వీడియోలకు 22.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియోలకు వచ్చిన వ్యూస్ కంటే ఇవి 43 రెట్లు అధికం. ఈ నెల వ్యూస్ పరంగా జెలెన్‌స్కీ రెండో స్థానంలో ఉన్నారు. మొత్తం 4.5 బిలియన్ వ్యూస్ ఉన్న మోదీ ఛానల్, ఇతర రాజకీయనాయకుల ఛానల్స్ కంటే ముందే ఉంది.
Here's News
PM @narendramodi becomes first world leader whose YouTube Channel reaches 2 crore subscribers. pic.twitter.com/imOaaenq6s
— Press Trust of India (@PTI_News) December 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 26, 2023 08:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

