Samsung Galaxy S22 Series: శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌ వచ్చేశాయి, మూడు వేరియంట్లలో స్మార్ట్‌ఫోన్లు, ప్రారంభ ధర రూ.59,800
Samsung Galaxy S22 Series (Photo Credits: Samsung)

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ తన లేటెస్ట్ శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2022 ఈవెంట్‌లో విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో భాగంగా...శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మూడు స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్‌ రిలీజ్‌ చేసింది. ఫ్లాగ్‌షిప్‌ స్పెసిఫికేషన్లతో హైఎండ్ మోడల్స్‌గా ఇవి నిలవనున్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో రానుంది. వీటి ధరలు గెలాక్సీ ఎస్ 21 కన్నా ఎక్కువగా ఉండనున్నాయి. ఈ ఫోన్లు 8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్లలో రానుంది. కాగా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర 799డాలర్లు (దాదాపు రూ.59,800)గా ఉండనుంది. ఇక శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 ప్లస్ కూడా 8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ, 8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ రెండు వేరియంట్లలో రానుంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర 999డాలర్లు (సుమారు రూ.74,800)గా ఉంది.

ప్రేమికులరోజున స్మార్ట్‌ఫోన్‌ కానుకగా ఇవ్వాలనుకుంటున్నారా,తక్కువ ధరలో వచ్చే స్మార్ట్ ఫోన్లు మీకోసం...

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 8జీబీ ర్యామ్‌ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 12జీబీ ర్యామ్‌ + 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 12జీబీ ర్యామ్‌ + 512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 12జీబీ ర్యామ్‌ + 1టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్లలో రానుంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర 1199 డాలర్లు(దాదాపు రూ. 89, 700)గా ఉంది. ఈ మూడు రకాల ఫోన్లు బ్లాక్‌, వైట్‌, పింక్ గోల్డ్, ఫాంటమ్ గ్రీన్ కలర్లలో లభించనున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌ భారత్‌లో ఎప్పుడూ లభ్యమవుతాయనే విషయంపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 స్మార్ట్‌ఫోన్స్‌ అమ్మకాలు ఫిబ్రవరి 25న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 ఫీచర్లు

6.1-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే

గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ

ఆండ్రాయిడ్‌ 12

ఆక్టా-కోర్ 4nm ప్రాససర్‌

50 ఎంపీ+ 12 ఎంపీ+ 10 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌

10 ఎంపీ సెల్ఫీ కెమెరా

8జీబీ ర్యామ్‌+ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

5జీ సపోర్ట్‌

బ్లూటూత్ v5.2

యూఎస్‌బీ టైప్‌ సీ సపోర్ట్‌

అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ విత్‌ వైర్‌లెస్‌ పవర్‌షేర్‌

3,700mAh బ్యాటరీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22ప్లస్‌ ఫీచర్లు

6.6-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే

గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ

ఆండ్రాయిడ్‌ 12

ఆక్టా-కోర్ 4nm ప్రాససర్‌

50 ఎంపీ+ 12 ఎంపీ+ 10 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌

10 ఎంపీ సెల్ఫీ కెమెరా

12జీబీ ర్యామ్‌+ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

5జీ సపోర్ట్‌

బ్లూటూత్ v5.2

యూఎస్‌బీ టైప్‌ సీ సపోర్ట్‌

అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

45 W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

15 W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ విత్‌ వైర్‌లెస్‌ పవర్‌షేర్‌

4,500mAh బ్యాటరీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా ఫీచర్లు

6.8-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే

గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ

ఆండ్రాయిడ్‌ 12

ఆక్టా-కోర్ 4nm ప్రాససర్‌

108 ఎంపీ+ 12 ఎంపీ+ 10 ఎంపీ+ 10 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా సెటప్‌

40 ఎంపీ సెల్ఫీ కెమెరా

12జీబీ ర్యామ్‌+ 1 టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

5జీ సపోర్ట్‌

బ్లూటూత్ v5.2

యూఎస్‌బీ టైప్‌ సీ సపోర్ట్‌

అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ విత్‌ వైర్‌లెస్‌ పవర్‌షేర్‌

5,000mAh బ్యాటరీ