Newdelhi, Sep 2: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3తో (Chandrayaan-3) జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది. సూర్యుడిపై (Sun) అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1(Aditya L1)ను ప్రయోగించనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ఇందుకు వేదిక కానున్నది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను మోసుకుంటూ పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది. ఇప్పటికే ప్రయోగ రిహార్సల్ విజయవంతం అవగా.. కౌంట్‌డౌన్ ప్రక్రియ కూడా మొదలైంది. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే సరిగ్గా ఉదయం 11.50 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది.
Aditya L1 Launch Live Updates: ISRO all set for Sun mission with Aditya launch today pic.twitter.com/RM1hyg3FbW
— NandighoshaTV (@NandighoshaTV) September 2, 2023
ఇదే మొదటి శాటిలైట్
సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న మొదటి శాటిలైట్ ఇదే కావడం విశేషం.
పేలోడ్లు ఇవీ..
- విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ (వీఈఎల్సీ)
- సోలార్ అల్ట్రవైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్‌యూఐటీ)
- సోలార్ లో ఎనర్జీ ఎక్స్- రే స్పెక్ట్రోమీటర్
- హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్
- ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్
- ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య
- అడ్వాన్స్ ట్రై -ఆక్సిల్ హై రిజల్యూషన్ డిజిటల్ మాగ్నెటోమీటర్