NASA Alert: భూమి వైపు మూడు గ్రహ శకలాలు దూసుకొస్తున్నాయి, వాటి నుంచి భూమికి ముప్పుపై నాసా కీలక సమాచారం ఇదిగో..

భూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వెల్లడించింది

NASA Alert: భూమి వైపు మూడు గ్రహ శకలాలు దూసుకొస్తున్నాయి, వాటి నుంచి భూమికి ముప్పుపై నాసా కీలక సమాచారం ఇదిగో..
asteroids approaching Earth soon

భూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వెల్లడించింది.ఈ శకలాలు భూమికి అత్యంత దగ్గరగా వస్తున్నప్పటికీ, వాటి నుంచి భూమికి ముప్పు ఏమీ ఉండదని నాసా పేర్కొంది.

ఈ మూడు గ్రహశకలాల్లో అన్నింటి కంటే పెద్దది కేహెచ్3-2024 అని, ఇది 610 అడుగులు ఉంటుందని నాసా వివరించింది. ఇది పొడవైన భవనం అంత పరిమాణంలో ఉంటుందని తెలిపింది. ఇది ఆగస్టు 10వ తేదీన భూమికి 5.6 మిలియన్ కిలోమీటర్ల సమీపానికి వస్తుందని తెలిపింది.  ఖండాలు ఏడు అని పుస్తకాల్లో చదువుకున్నాం కదూ.. అయితే, అవి ఏడు కాదు ఆరే.. ఉత్తర అమెరికా, యూరప్‌ ఇంకా విడిపోలేదట.. ఎలాగంటే?

రెండోదైన పీకే1-2024 110 అడుగులతో ఓ చిన్న విమానం సైజులో ఉంటుందని, ఇది భూమికి 6.4 మిలియన్ కిలోమీటర్ల దగ్గరగా వస్తుందని నాసా వెల్లడించింది. దీంతో ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది. మూడో గ్రహశకలం ఓఎన్2-2024 ఆగస్టు 12న భూ గ్రహానికి దగ్గరగా వస్తుందని, 120 అడుగులు ఉండే ఈ గ్రహశకలం భూమికి 6.8 మిలియన్ కిలోమీటర్లు దగ్గరగా వస్తుందని నాసా వివరించింది. ఇది కూడా భూమిపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది. అయినప్పటికీ భూమండలం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు గ్రహశకలాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని నాసా పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Aug 09, 2024 08:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).