Six Continents: ఖండాలు ఏడు అని పుస్తకాల్లో చదువుకున్నాం కదూ.. అయితే, అవి ఏడు కాదు ఆరే.. ఉత్తర అమెరికా, యూరప్ ఇంకా విడిపోలేదట.. ఎలాగంటే?
ప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలున్నాయి? ఏడే కదా! చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో కూడా అదే చదువుకున్నాం కదా అంటారా? అది నిజమే! అయితే, ఇప్పటివరకూ ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అని మొత్తం ఏడు ఖండాలు ఉన్నట్టు మనం చదువుకున్న విషయంలో నిజం లేదట.
Newdelhi, Aug 8: ప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలున్నాయి? (Continents) ఏడే కదా! చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో (Books) కూడా అదే చదువుకున్నాం కదా అంటారా? అది నిజమే! అయితే, ఇప్పటివరకూ ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అని మొత్తం ఏడు ఖండాలు ఉన్నట్టు మనం చదువుకున్న విషయంలో నిజం లేదట. వాస్తవానికి భూగోళంపై 7 ఖండాలు లేవని, ప్రస్తుతానికి 6 ఖండాలే ఉన్నాయని నూతన అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు. ఈ మేరకు డెర్బీ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
కారణం ఇదట
ఖండాల్లో భాగమైన ఉత్తర అమెరికా, యూరప్ మనం అనుకుంటున్నట్టుగా ఇంకా వేరుపడలేదని, అవి ఖండాలుగా విడిపోయే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని పరిశోధకులు తెలిపారు. దీన్నిబట్టి అవి రెండూ ఒకే ఖండంగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీన్నిబట్టి ఖండాలు మొత్తం ఆరని తేల్చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 08, 2024 09:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

