Newdelhi, Aug 8: ఆర్ధిక మాంద్యం భయాలు ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగాలు (Jobs) కోల్పోతున్నారు. ఇది నిజమే. అయితే, జీతం ఇయ్యం, సెలవులు ఉండవు. ఆదివారం కూడా ఆఫీసుకు (Office) రావాల్సిందే అని కండిషన్స్ పెడితే, ఎవరు ఆ కొలువులో చేరుతారు? అయినా, ఏ కంపెనీ అయినా ఇలా ప్రకటన ఇస్తుందా? అనుకుంటున్నారా? నిజమండీ.. గుజరాత్ కు చెందిన బ్యాటరీఓకేటెక్నాలజీస్ అనే కంపెనీ వ్యవస్థాపకుడు శుభమ్ మిశ్రా లింక్డ్ ఇన్ వేదికగా ఇదే ప్రకటన చేశాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ జాబ్ లో చేరడం కంటే సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చని ఒకరు.. బజ్జీల బండి పెట్టుకోవచ్చని మరొకరు కామెంట్స్ పెడుతున్నారు.
Gujarat Entrepreneur's Job Post With "Zero Salary, No Weekend Offs" Sparks Debate Online https://t.co/gSAKalt6Al pic.twitter.com/hFD2olBfAO
— NDTV (@ndtv) August 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)