Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములు వీళ్లే, భారత వ్యోమగాములకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు, వీడియో ఇదిగో..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ISRO) చేపడుతున్న గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్తోపాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
- Read in
- తెలుగు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ISRO) చేపడుతున్న గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్తోపాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.ఈ వ్యోమగాములు.. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే నాలుగు శక్తులని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో గల విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో గగన్ యాన్ ప్రాజెక్టు పురోగతిని ప్రధాని పరిశీలించారు. అనంతరం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ను సత్కరించారు.
40 ఏళ్ల తర్వాత భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెట్టనున్నారు. ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లనున్నారు. మూడు రోజులపాటు వారిని అక్కడే ఉంచి, తిరిగి భూమి మీదకు తీసుకొస్తారు. ఈ మిషన్‌లో పాల్గొనే ఆస్ట్రోనాట్లు సురక్షితంగా తిరిగి సముద్రంలో ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Here's Video
VIDEO | PM Modi meets astronaut-designates for Gaganyaan Mission - Group Captain P Balakrishnan Nair, Group Captain Ajit Krishnan, Group Captain Angad Pratap and Wing Commander S Shukla - at Vikram Sarabhai Space Centre (VSSC) in Kerala's Thiruvananthapuram.
(Full video… pic.twitter.com/dhaYddPzdk
— Press Trust of India (@PTI_News) February 27, 2024
Here's News
Astronaut designates for the prestigious #Gaganyaan Mission: pic.twitter.com/oktuuLbtYK
— All India Radio News (@airnewsalerts) February 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 27, 2024 02:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

