Chandrayaan-3: నేడే చంద్రయాన్ 3 ల్యాండింగ్‌.. ఈ అద్భుత దృశ్యాలను లైవ్‌ లో చూపించాలన్న నిర్ణయంపై తెలంగాణ విద్యాశాఖ యూటర్న్.. ఆ నిర్ణయం వెనక్కి.. కారణం ఏమిటంటే??

యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాబిల్లిపై చంద్రయాన్ ల్యాండింగ్‌‌ ను లైవ్‌ లో చూపించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. పాఠశాలల పని వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని నిన్న సాయంత్రం ప్రకటించింది.

Chandrayaan-3: నేడే చంద్రయాన్ 3 ల్యాండింగ్‌.. ఈ అద్భుత దృశ్యాలను లైవ్‌ లో చూపించాలన్న నిర్ణయంపై తెలంగాణ విద్యాశాఖ యూటర్న్.. ఆ నిర్ణయం వెనక్కి.. కారణం ఏమిటంటే??
Chandrayaan 3 Mission Update (Photo Credits: X/2isro)

Hyderabad, Aug 23: యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాబిల్లిపై (Moon) చంద్రయాన్-3 (Chandrayaan-3) ల్యాండింగ్‌ (Landing) నేడే. ‌ఈ కార్యక్రమాన్ని లైవ్‌ (Live) లో చూపించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ (Telangana) విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. పాఠశాలల పని వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని నిన్న సాయంత్రం ప్రకటించింది. చంద్రయాన్ 3లోని ల్యాండర్ విక్రమ్ నేటి సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై కాలుమోపనుంది. ఇస్రో దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ అపురూప ఘట్టాన్ని విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలని నిర్ణయించిన విద్యాశాఖ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

Chandrayaan 3 Landing: అన్ని స్కూళ్లూ, కాలేజీల్లో చంద్రయాన్-3 ల్యాండింగ్‌ ప్రత్యక్షప్రసారం, ప్రభుత్వం పాఠశాలల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్ నిర్ణయం

నిర్ణయం మార్పునకు కారణం..

జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయ్యే సమయానికి, స్కూళ్లు విడిచిపెట్టే సమయానికి మధ్య భారీ తేడా ఉండడంతో లైవ్ టెలీకాస్ట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సాధారణంగా స్కూళ్లు 4.30 గంటలకే ముగుస్తాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను 6.30 గంటల వరకు స్కూళ్లలోనే ఉంచడం సరికాదని, దీనివల్ల దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల రవాణాకు ఇబ్బందులు తలెత్తుతాయని భావించి తొలుత జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది.

Chandrayaan 3: వీడియో ఇదిగో, చందమామపై మెల్లిగా దిగిన విక్రమ్ ల్యాండర్, యానిమేషన్‌ రూపంలో ఊహాజనిత వీడియోను విడుదల చేసిన PIB

మరేం చేయనున్నారు??

ఈ సమయంలో తెలంగాణ విద్యాశాఖ మరో కీలక ప్రకటన చేసింది. రేపు మధ్యాహ్నం యూట్యూబ్ ద్వారా చంద్రయాన్ ల్యాండింగ్‌ ను చూపించవచ్చని స్కూల్స్ యాజమాన్యాలకు తెలిపింది.

(The above story first appeared on LatestLY on Aug 23, 2023 08:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).