WhatsApp New Feature: వాట్సాప్ నుంచి అదిరే ఫీచర్, మీరు ఇక నుంచి తేదీల వారీగా మెసేజ్‌లు సెర్చ్ చేయవచ్చు, మీకు మీరే సందేశాన్ని కూడా పంపించుకోవచ్చు
మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎల్లప్పుడూ కొత్త ఫీచర్లను అభివృద్ధిని చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మరో కొత్త సదుపాయాన్ని (WhatsApp New Feature) యూజర్లకు అందబాటులోకి తీసుకొచ్చింది. కొత్త ఫీచర్ ప్రకారం.. తేదీల వారీగా సందేశాలను (search by date feature) అన్వేషించి గుర్తించొచ్చు
మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎల్లప్పుడూ కొత్త ఫీచర్లను అభివృద్ధిని చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మరో కొత్త సదుపాయాన్ని (WhatsApp New Feature) యూజర్లకు అందబాటులోకి తీసుకొచ్చింది. కొత్త ఫీచర్ ప్రకారం.. తేదీల వారీగా సందేశాలను (search by date feature) అన్వేషించి గుర్తించొచ్చు. కొత్త అప్ డేట్ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఈ ఫీచర్ తీసుకొచ్చింది. యూజర్లు ముందు తమ ఫోన్ లో ఉన్న వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీకు మీరే సందేశాన్ని కూడా పంపించుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా వాట్సాప్ యాప్ అప్ డేషన్ తో అందుబాటులోకి రానుంది. ఇతర యాప్స్ లో ఉన్న వీడియో, ఫొటోలు, డాక్యుమెంట్లను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవాలని అనుకుంటే.. వేరే యాప్ లో ఉన్న వాటిని డ్రాగ్ చేసి తీసుకొచ్చి వాట్సాప్ లో డ్రాప్ చేసే ఫీచర్ కూడా తాజా అప్ డేట్ తో అందుబాటులోకి వస్తుంది.
వాట్సాప్ లో తేదీల వారీ సందేశాలు, మీడియా కంటెంట్ ను సెర్చ్ చేసుకునేందుకు పైన సెర్చ్ బార్ కు వెళ్లాలి. అక్కడ తేదీ, నెల, సంవత్సరం టైప్ చేస్తే చాలు ఆ రోజున ఏఏ కాంటాక్టులతో ఏమేమి షేర్ చేసుకున్నారనే వివరాలు వస్తాయి. అలాగే, చాట్ విండో ఓపెన్ చేసి, సెర్చ్ మెస్సేజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కుడిచేతివైపు కార్నర్లో కేలండర్ ఐకాన్ కనిపిస్తుంది. కావాల్సిన తేదీని అక్కడ ఎంపిక చేసుకుంటే ఆ రోజు మెస్సేజ్ లు అక్కడ కనిపిస్తాయి. సమీప భవిష్యత్తులో మీడియా కంటెంట్ ను ఒరిజినల్ సైజు వే వాట్సాప్ లో పంపుకునేందుకు అవకాశం ఏర్పడనుంది.
(The above story first appeared on LatestLY on Jan 24, 2023 03:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

