New Delhi, JAN 14: ప్రపంచవ్యాప్తంగా పాపులర్ సోషల్ మెసేజింగ్ అప్లికేషన్‌లలో WhatsApp ఒకటి. దేశవ్యాప్తంగా వాట్పాప్ 2 బిలియన్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. వాట్సాప్ మెసేజ్, వాయిస్ కాల్‌లు, వీడియో కాల్‌ల ద్వారా తమ స్నేహితులు, బంధువులకు కనెక్ట్ అయ్యేలా యూజర్లను అనుమతిస్తుంది. మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ కస్టమ్ నోటిఫికేషన్ ఫీచర్‌ను అందిస్తుంది. వాట్సాప్ ఇన్‌కమింగ్ కాల్‌లు, మెసేజ్‌ల కోసం కస్టమ్ రింగ్‌టోన్‌లను (Custom Ringtones) సెట్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. వాట్సాప్ కాంటాక్టుల కోసం కస్టమ్ హెచ్చరికలను సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇతర కాంటాక్టుల నుంచి వేరు చేయవచ్చు. మీరు నిర్దిష్ట కాంటాక్ట్ కోసం WhatsApp ఇన్‌కమింగ్ కాల్‌లో (incoming call) కస్టమ్ రింగ్‌టోన్‌లను సెట్ చేసే మార్గం ఉంది. వాట్సాప్ కాల్ చేసేటప్పుడు ఏయే కాంటాక్టుకు ఏయే రింగ్ టోన్ (Ringtone) రావాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేసి.. చాట్స్ ట్యాబ్‌కు వెళ్లండి.
* ఇప్పుడు, మీరు కస్టమ్ రింగ్‌టోన్‌ని సెట్ చేయాలనుకుంటున్న కాంటాక్టును ఎంచుకోండి.
* ఆ తర్వాత, కాంటాక్ట్ పేరుపై Tap చేసి కాంటాక్టు ప్రొఫైల్‌కు వెళ్లండి.
* కిందికి స్క్రోల్ చేసి కస్టమ్ నోటిఫికేషన్‌పై Tap చేయండి.
* ‘Use custom notifications’ బాక్సును ఎంచుకోండి.
* కాల్ నోటిఫికేషన్‌ల కింద రింగ్‌టోన్‌పై Tap చేయండి.
* మీకు నచ్చిన రింగ్‌టోన్‌ను ఎంచుకోండి.
Androidలో వ్యక్తిగత కాంటాక్టుల కోసం కస్టమ్ టోన్‌ని సెట్ చేయండి :
* మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేసి చాట్స్ ట్యాబ్‌కు వెళ్లండి.
* మీరు కస్టమ్ రింగ్‌టోన్‌ని సెట్ చేయాలనుకుంటున్న కాంటాక్టును ఎంచుకోండి.
* ఆ తర్వాత, వాల్‌పేపర్ & సౌండ్‌పై Tap చేయండి.
* కస్టమ్ టోన్ కింద.. విభిన్న టోన్‌ని ఎంచుకోవడానికి అలర్ట్ టోన్‌పై Tap చేయండి.
ఐఫోన్‌లలో గ్రూప్ కాల్‌లు డిఫాల్ట్ రింగ్‌టోన్‌ని ఉపయోగిస్తాయని గమనించండి. ఈ రింగ్‌టోన్ కస్టమ్ చేయడం కుదరదు. కానీ, మీరు వాటిని ఆండ్రాయిడ్‌లో కస్టమ్ రింగ్ టోన్ గా మార్చుకోవచ్చు. తద్వారా మీరు గ్రూప్ వీడియో కాల్‌ని పొందిన ప్రతిసారీ వేరే రింగ్‌టోన్ వినిపిస్తుంది.
* మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేసి, చాట్స్ Tabకు వెళ్లండి.
* ఇక్కడ, మీరు కస్టమ్ రింగ్‌టోన్‌ని సెట్ చేయాలనుకుంటున్న గ్రూపును ఎంచుకోండి.
* ఆ తర్వాత, గ్రూప్ పేరుపై Tap చేసి కాంటాక్టు ప్రొఫైల్‌కు వెళ్లండి.
* క్రిందికి స్క్రోల్ చేయండి. కస్టమ్ నోటిఫికేషన్‌పై Tap చేయండి.
* ‘Use custom notifications’ Boxను ఎంచుకోండి.
* కాల్ నోటిఫికేషన్‌ల కింద, రింగ్‌టోన్‌పై Tap చేయండి.
* మీకు నచ్చిన రింగ్‌టోన్‌ను ఎంచుకోండి.