WhatsApp: వాట్సాప్ నుంచి సూపర్ ఫీచర్, గ్రూపు నోటిఫికేషన్స్ బెడద ఇక తప్పినట్లే, గ్రూప్‌లో సభ్యుల సంఖ్య 256కు మించితే ఆటోమేటిగ్గా మ్యూట్ ఆన్
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ వస్తోంది. గ్రూప్‌లో సభ్యుల సంఖ్య 256కు మించితే ఆటోమేటిగ్గా మ్యూట్ ఆన్ అయిపోతుంది. అటువంటప్పుడు సదరు గ్రూపు నోటిఫికేషన్లు కనిపించవు.
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ వస్తోంది. గ్రూప్‌లో సభ్యుల సంఖ్య 256కు మించితే ఆటోమేటిగ్గా మ్యూట్ ఆన్ అయిపోతుంది. అటువంటప్పుడు సదరు గ్రూపు నోటిఫికేషన్లు కనిపించవు. ప్రస్తుతం ఈ ఫీచర్ ను బీటా టెస్టర్ల పరిధిలో పరీక్షిస్తోంది. అంటే త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుందని అర్థం చేసుకోవచ్చు. కొత్త ఫీచర్ ప్రకారం సభ్యుల సంఖ్య 256 దాటినప్పుడు దానంతట అదే వాట్సాప్ చాట్ నోటిఫికేషన్లను మ్యూట్ చేస్తుంది.
దీనివల్ల అదనపు నోటిఫికేషన్ల బెడద వదులుతుంది. వాట్సాప్ ఇటీవలే ఒక గ్రూపులో సభ్యుల సంఖ్యను 256 నుంచి 1,024కు పెంచడం తెలిసిందే. దీంతో చాలా మందికి ప్రశాంతత ఏర్పడనుంది. నోటిఫికేషన్లు యథావిధిగా రావాలని భావిస్తే గ్రూపు సెట్టింగ్స్ లో అన్ మ్యూట్ చేసుకోవడమే.
(The above story first appeared on LatestLY on Nov 14, 2022 05:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

