Pesky Spam Calls: స్పామ్‌కాల్స్‌పై కేంద్రం త్వరలో సరికొత్త మార్గదర్శకాలు జారీ, ఉల్లంఘిస్తే టెలికాం సంస్థలకు భారీ జరిమానాలు

స్పామ్‌కాల్స్‌కు చెక్‌పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఇలాంటి స్పామ్‌ కాల్స్‌ నియంత్రణ కోసం ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ టెలీకమ్యూనికేషన్స్‌, టెలికాం నియంత్రణ సంస్థ ( ట్రాయ్‌) మార్గదర్శకాలను రూపొందించింది. రిజిస్టర్‌ కాని మొబైల్‌ నంబర్స్‌, అన్‌వాంటెడ్‌ కాల్స్‌ నియంత్రణ కోసం పలు పరిష్కార మార్గాలను ఇందులో ప్రతిపాదించింది.

Pesky Spam Calls: స్పామ్‌కాల్స్‌పై కేంద్రం త్వరలో సరికొత్త మార్గదర్శకాలు జారీ, ఉల్లంఘిస్తే టెలికాం సంస్థలకు భారీ జరిమానాలు
Spam Calls (photo-ANI)

స్పామ్‌కాల్స్‌కు చెక్‌పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఇలాంటి స్పామ్‌ కాల్స్‌ నియంత్రణ కోసం ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ టెలీకమ్యూనికేషన్స్‌, టెలికాం నియంత్రణ సంస్థ ( ట్రాయ్‌) మార్గదర్శకాలను రూపొందించింది. రిజిస్టర్‌ కాని మొబైల్‌ నంబర్స్‌, అన్‌వాంటెడ్‌ కాల్స్‌ నియంత్రణ కోసం పలు పరిష్కార మార్గాలను ఇందులో ప్రతిపాదించింది.

సాధారణంగా స్పామ్‌ కాల్స్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల నుంచే ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి వీటి నుంచి ప్రయోజనం పొందుతున్న కంపెనీలే ఈ స్పామ్‌ కాల్స్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. ట్రాయ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే టెలికాం సంస్థలు భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మూడు రోజుల్లోనే ఈపీఎఫ్ క్లయిమ్ సెటిల్, కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన EPFO, ఎలా ప్రాసెస్ చేయాలో తెలుసుకోండి

స్పామ్‌ కాల్స్‌ను గుర్తించేందుకు వీలుగా వాటి ఐడెంటిటీని టెలికాం సంస్థలు వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకోసం 3 వేర్వేరు సిరీస్‌లను తీసుకురానున్నారు. మార్కెటింగ్‌ కాల్స్‌ కోసం అయితే 140, సర్వీస్‌ కాల్స్‌ కోసమైతే 160, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కమ్యూనికేషన్‌ కోసం అయితే 111 ఇవ్వాలని ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఇలా సిరీస్‌ల ద్వారా ప్రతి కాలర్‌ పేరు, సెక్టార్‌ సహా తదితర వివరాలను బహిర్గతం చేయడం ద్వారా కష్టమర్లు తమకు వచ్చే కాల్స్‌ను లిఫ్ట్‌ చేయాలా? వద్దా? అనేది నిర్ణయించుకునే వీలు ఉంటుంది. టెలికాం సంస్థలతో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత వారం జరిపిన చర్చల అనంతరం ఈ మార్గదర్శకాలను రూపొందించారు.

(The above story first appeared on LatestLY on May 15, 2024 08:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).