ఉద్యోగుల భవిష్య నిధి (EPF) సభ్యుల జీవితాన్ని సులభతరం చేయడానికి, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మెడికల్ క్లెయిమ్‌లు , విద్య, వివాహం మరియు గృహాల కోసం ఆటో-సెటిల్‌మెంట్ నిబంధనలను సడలించింది . రూల్ 68K కింద విద్య మరియు వివాహం కోసం మరియు రూల్ 68B కింద గృహనిర్మాణం కోసం ఆటో-సెటిల్‌మెంట్ సదుపాయం ఇటీవలే ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు ఈ హెడ్‌ల కింద రూ. 1 లక్ష వరకు ఉన్న అన్ని క్లెయిమ్‌లు మానవ ప్రమేయం లేకుండా స్వయంచాలకంగా ప్రాసెస్ చేయబడతాయి.
క్లయిమ్ చేసిన మూడు రోజుల్లో ఈపీఎఫ్ఓ సెటిల్ చేస్తుంది. ఉన్నత విద్యావసరాలు, వైద్య చికిత్స, వివాహం, ఇంటి నిర్మాణం తదితర అవసరాల కోసం విత్ డ్రాయల్స్ కోసం దరఖాస్తు చేస్తే, సదరు క్లయిమ్స్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడంతోపాటు మనుష్యుల జోక్యాన్ని తప్పించడం కోసం ఆటోమోడ్ సెటిల్ మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆగని లేఆప్స్, స్టోర్లను మూసేసి ఉద్యోగులను ఇంటికి సాగనంపిన వాల్‌మార్ట్, వందలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకు
ఇప్పటి వరకూ ఇటువంటి క్లయిమ్‌లు సెటిల్ చేయడానికి సుమారుగా 15-20 రోజుల టైం పట్టేది. ఈపీఎఫ్ సభ్యుడి అర్హత, పత్రాలు, ఈపీఎఫ్ ఖాతా కేవైసీ స్టేటస్, క్లయిమ్ సెటిల్ చేయడానికి ముందు బ్యాంకు ఖాతా వివరాలన్నీ చెక్ చేయడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టేది. ఇప్పటి వరకూ కొనసాగిన సంప్రదాయ ప్రక్రియ వల్ల ఇన్ వాల్యూడ్ క్లయిమ్‌లు తరుచుగా తిరస్కరించేవారు. కానీ, ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా క్లయిమ్‌లను రెండో దశలో పరిశీలించి, ఆమోదించే వెసులుబాటు ఉంటుంది. ఏ ఒక్క క్లయిమ్ కూడా మిస్ కాదు.
ఈపీఎఫ్ విత్ డ్రాయల్ క్లయిమ్ ప్రాసెసింగ్ ఎలా చేయాలంటే..
1.యూఏఎన్, పాస్‌వర్డ్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో లాగిన్ కావాలి.
2. అనంతరం ఆన్ లైన్ సర్వీసులకు వెళ్లి, ‘క్లయిమ్’ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
3. బ్యాంకు ఖాతాను ధ్రువీకరించాలి. అటుపై ఆన్ లైన్ క్లయిమ్ ప్రొసీడ్ కావాలని క్లిక్ చేయాలి.
4. కొత్త పేజీ ఓపెన్ కాగానే పీఎం అడ్వాన్స్ ఫామ్ 31 సెలెక్ట్ చేసుకోవాలి.
5. మీరు మనీ విత్ డ్రా చేసుకునే పీఎఫ్ ఖాతాను ఎంచుకోవాలి.
6. మీరెందుకు మనీ విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారు, ఎంత మనీ కావాలనుకుంటున్నారో తెలపాలి.
7. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాంక్ చెక్ లేదా పాస్ బుక్ స్కాన్డ్ కాపీ అప్ లోడ్ చేయాలి.
8. ఆధార్‌తో ధ్రువీకరణకు మీ సమ్మతి కావాలి.
9. క్లయిమ్ ప్రాసెస్ అయిన తర్వాత.. అది ఎంప్లాయర్ ఆమోదం కోసం వెళుతుంది.
10. సబ్‌స్క్రైబర్ తన క్లయిమ్ స్టేటస్‌ను ఆన్ లైన్ సర్వీస్‌లో చెక్ చేసుకోవచ్చు.