100 Day Cough: యూకేను క‌ల‌వ‌ర‌పెడుతున్న కొత్త మ‌హ‌మ్మారి, ద‌గ్గుతో డేంజ‌ర్ లో ప‌డుతున్న ప్ర‌జ‌లు, 100 రోజుల ద‌గ్గుతో జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రిస్తున్న ఆరోగ్య నిపుణులు

యూకేని ‘100 రోజుల దగ్గు’ (100 Day Cough) వణికిస్తోంది. కోరింత దగ్గు రకానికి చెందిన ఈ దగ్గు మూడునెలల పాటు కొనసాగుతోంది. జలుబుతో మొదలయ్యే ఈ దగ్గుని తేలికగా తీసుకోవద్దని.. తప్పనిసరిగా మాస్కులు వాడమని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. యూకేని (UK) ఇప్పుడు కోరింత దగ్గు చాలా ఇబ్బంది పెడుతోంది.

100 Day Cough: యూకేను క‌ల‌వ‌ర‌పెడుతున్న కొత్త మ‌హ‌మ్మారి, ద‌గ్గుతో డేంజ‌ర్ లో ప‌డుతున్న ప్ర‌జ‌లు, 100 రోజుల ద‌గ్గుతో జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రిస్తున్న ఆరోగ్య నిపుణులు
Cough (PIC@ Pixabay)

Paris, Dec 10: యూకేని ‘100 రోజుల దగ్గు’ (100 Day Cough) వణికిస్తోంది. కోరింత దగ్గు రకానికి చెందిన ఈ దగ్గు మూడునెలల పాటు కొనసాగుతోంది. జలుబుతో మొదలయ్యే ఈ దగ్గుని తేలికగా తీసుకోవద్దని.. తప్పనిసరిగా మాస్కులు వాడమని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. యూకేని (UK) ఇప్పుడు కోరింత దగ్గు చాలా ఇబ్బంది పెడుతోంది. ముక్కు కారడం, గొంతు నొప్పితో మొదలైన దీనిని సాధారణ జలుబుగా పొరబడవచ్చు. ఆ తరువాత దగ్గు మొదలై దగ్గలేని (100 Day Cough) పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దగ్గు కారణంగా గొంతులో పుండ్లు, చెవిలో ఇన్ఫెక్షన్లు ఓ దశలో మూత్రవిసర్జన ఆపుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాక్టీరియా కారణంగా సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. 3 లేదా 4 నిముషాల పాటు తీవ్రమైన దగ్గు రావడం వల్ల వాంతులు, లేదా పక్కటెముకలు విరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

Russia Presidential Election 2024: మార్చి 17న రష్యా అధ్యక్ష ఎన్నికలు, వరుసగా ఐదోసారి పుతిన్ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు, ప్రత్యర్థులంతా జైళ్లో, విదేశాళ్లో ఉండటమే కారణం 

ప్రస్తుతం యూకేలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) నుండి ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ రిచర్డ్ టెడ్డర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం కోరింత దగ్గు గతేడాదితో పోలిస్తే 250 శాతం పెరిగిందని తెలుస్తోంది. కరోనా, లాక్ డౌన్ సమయంలో ఇంత తీవ్రమైన పరిస్థితి కనిపించలేదు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తోంది.

UK Shocker: పార్కులో బెర్రీ పండ్లు తిన్న 14 ఏళ్ల బాలుడు, వెంటనే అపస్మారక స్థితికి చేరుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి 

పిల్లల్లో ఈ దగ్గు నివారించడానికి మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి టీకాలు అవసరం అని NHS హెచ్చరించింది. గర్భిణీలు టీకాలు వేయించుకోవాలని .. తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించాలని పేర్కొంది. జూలై నుండి నవంబర్ మధ్య ఇంగ్లాండ్, వేల్స్ లో 716 మంది కోరింత దగ్గు బారిన పడ్డారు. 2022 తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

(The above story first appeared on LatestLY on Dec 10, 2023 08:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).