 
                                                                 ది ఇండిపెండెంట్ ప్రకారం, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్ ప్రాంతంలో తన తండ్రితో కలిసి పార్క్‌లో షికారు చేస్తున్నప్పుడు కనుగొన్న విషపూరిత బెర్రీలు తిని 14 ఏళ్ల బాలుడు మరణించాడు. సమీపంలోని పార్కులో తండ్రితో పాటు రోజూ వ్యాయామానికి వెళుతున్న బాలుడు రోజూ ఓ చెట్టు దగ్గర ఆడుకునే వాడు. అయితే యూ చెట్టు నుండి కొన్ని బెర్రీలు, ఆకులను విషపూరితమైనవని గ్రహించకుండా తిన్నాడని పార్కులో ఉన్నవారు తెలిపారు. ఆ రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో, బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
అతన్ని ఎమర్జెన్సీ అంబులెన్స్‌లో రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు, అక్కడ అతను సెప్టెంబర్ 19, 2022న కన్నుమూశారు. అయితే అతని తండ్రి అవి తినకపోవడంతో బతికిపోయాడు. బెర్రీలు, ఆకులను తిన్న తర్వాత "టాక్సేన్ ఆల్కలాయిడ్ పాయిజనింగ్ కారణంగా రిఫ్రాక్టరీ కార్డియోజెనిక్ షాక్ వల్ల అతని మరణించాడని టాక్సికాలజీ నివేదికలో నమోదు చేయబడింది. యూ చెట్టు విషప్రయోగాలు అరుదుగా ఉన్నప్పటికీ, "కేసుల సంఖ్య" నమోదు చేయబడిందని ది ఇండిపెండెంట్ పేపర్ పేర్కొంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
