Covid Outbreak in South Korea: దక్షిణకోరియాలో కరోనా విశ్వరూపం, ఒక్కరోజే 4 లక్షలకు పైగా కరోనా కేసులు, నిన్న చైనా, ఇవాళ దక్షిణ కొరియాలో కేసుల పెరుగదలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన

ఇప్పటికే చైనాలో కరోనా పంజా విసురుతోంది. కొవిడ్‌ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో (China) ఎప్పుడూ లేనన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దక్షిణ కొరియానూ వైరస్‌ వణికిస్తోంది. కరోనా (Corona)మహమ్మారి దక్షిణకొరియాను (South Korea) వణికిస్తోంది. బుధవారం ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. ఏకంగా 4లక్షలకు పైగా కరోనా కేసులు (Corona Cases) వెలుగుచూశాయి.

Covid Outbreak in South Korea: దక్షిణకోరియాలో కరోనా విశ్వరూపం, ఒక్కరోజే 4 లక్షలకు పైగా కరోనా కేసులు, నిన్న చైనా, ఇవాళ దక్షిణ కొరియాలో కేసుల పెరుగదలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
COVID-19 in China. (Photo Credits: IANS)

South Korea, March 17: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron).. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులుగా కోవిడ్ (Covid)ఉధృతి తగ్గింది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. దీంతో యావత్ ప్రపంచం ఊపిరిపీల్చుకుంది. హమ్మయ్య.. ఇక కరోనా పీడ విరగడ అయినట్టే అని జనాలు రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే మళ్లీ కరోనా మహమ్మారి కల్లోలం మొదలైంది. తగ్గినట్లే తగ్గిన కరోనా.. మళ్లీ విజృంభిస్తోంది. భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటికే చైనాలో కరోనా పంజా విసురుతోంది. కొవిడ్‌ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో (China) ఎప్పుడూ లేనన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దక్షిణ కొరియానూ వైరస్‌ వణికిస్తోంది. కరోనా (Corona)మహమ్మారి దక్షిణకొరియాను (South Korea) వణికిస్తోంది. బుధవారం ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. ఏకంగా 4లక్షలకు పైగా కరోనా కేసులు (Corona Cases) వెలుగుచూశాయి. దక్షిణ కొరియా ప్రభుత్వ మీడియా వివరాల ప్రకారం.. బుధవారం 4,00,714 మందికి పాజిటివ్‌గా తేలింది.

ఆ దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 76లక్షల 29వేల 275కు చేరినట్లు కొరియా వ్యాధి నియంత్రణ, నివారణ ఏజెన్సీ స్పష్టం చేసింది. గత 24 గంటల్లో 293 మంది కోవిడ్ తో మృతి చెందారు.

Stealth Omicron in China: చైనాలో కొత్తగా స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్, గత 24 గంటల్లో 5,280 మందికి కరోనా, పలు ప్రావిన్సులలో కఠిన లాక్‌డౌన్ అమల్లోకి..

‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’ (Stealth Omicron) రూపంలో కొవిడ్‌ మహమ్మారి చైనాను మళ్లీ వణికిస్తోంది. రెండేళ్ల తర్వాత తొలిసారి.. చైనాలో మంగళవారం అత్యధికంగా 5,280 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందురోజు కంటే కేసులు రెట్టింపయ్యాయి. కొత్త కేసు ఒక్కటీ రాకూడదన్న(జీరో-టాలరెన్స్‌) వ్యూహంతో.. రెండేళ్లకు పైగా కొవిడ్‌ను కట్టడి చేస్తూ వస్తోన్న డ్రాగన్‌కు ఈ వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. వరుసగా ఆరో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో చైనా 13 పెద్ద నగరాలను మూసివేసింది. 3 కోట్ల మందికి పైగా ప్రజలను లాక్‌డౌన్ లో ఉంచింది. ప్రజారవాణాను నిలిపివేసింది. పలు నగరాల్లో ఆంక్షలు విధించింది.

Covid in Israel: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్, ఒమిక్రాన్‌కు చెందిన రెండు ఉపవేరియంట్లు బీఏ.1, బీఏ.2 లను గుర్తించిన ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ

మళ్లీ వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ (Omicron) వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, స్వల్ప విరామం తర్వాత వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ తిరగబడుతోందని హెచ్చరించింది. చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఎపిడెమిలాజిస్ట్‌ మరియా వాన్‌ ఖెర్ఖోవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మనమంతా అప్రమత్తంగా ఉండాలని.. టెస్టులు, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లు, వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలని సూచించారు.

(The above story first appeared on LatestLY on Mar 17, 2022 12:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).