COVID-19 (Representative Image)

Shanghai, Mar 15: కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ కేసులు (Stealth Omicron in China) పెరుగుతున్నాయి. రెండేండ్ల గరిష్ఠ స్థాయికి కేసులు పెరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తున్నది. ఇప్పటికే రెండు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించింది. చైనాలో సోమవారం 1,807 కేసులు నమోదు కాగా, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 5,280 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. హాంకాంగ్‌లోనూ వైరస్‌ విజృంభిస్తున్నది. నగరంలో మరణాలు ఎక్కువగా (COVID-19 Cases More Than Double in China) నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనతో నగరాన్ని వీడుతున్నారు.

చైనా దేశంలోని 18 ప్రావిన్సులలో ఒమైక్రాన్, డెల్టా వేరియెంట్ లతో జనం సతమతమవుతున్నారు. దీంతో షాంఘై నగరంలో అధికారులు పాఠశాలలను మూసివేశారు. షెన్ జెన్ దక్షిణ టెక్ పవర్ హౌస్ తోపాటు ఈశాన్య నగరాల్లోని పరిసరాలను పాక్షికంగా లాక్ చేశారు. జిలిన్ నగరంలో పాక్షికంగా లాక్ డౌన్ చేశారు. ఉత్తర కొరియా సరిహద్దుల్లోని పట్టణ ప్రాంతమైన యాన్జీలో కరోనా కేసులతో 7 లక్షలమంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

జిలిన్ నగరంలోనే 2,200 కరోనా ఒమైక్రాన్ వేరియంట్ కేసులు( Biggest Outbreak Since Early Days of Pandemic) నమోదయ్యాయి.చాంగ్ చున్ నగరంతోపాటు మరో మూడు చిన్న నగరాల్లో మార్చి 1వతేదీ నుంచి లాక్ డౌన్ విధించారు.చాంగ్ చున్ హెల్త్ కమిషన్ అధిపతిని ఉద్యోగం నుంచి తొలగించామని సర్కారు తెలిపింది.కరోనా కేసులు పెరిగేకొద్దీ చైనా దేశంలో జాతీయ ఆరోగ్య కమిషన్ యాంటిజెన్ పరీక్షలను ముమ్మరం చేసింది. ఒమిక్రాన్ ఉప వేరియంట్ అయిన ‘స్టెల్త్ ఒమిక్రాన్’గా పిలుస్తున్న ‘బి.ఎ.2’ కారణంగా పలు నగరాలు క్రమంగా లాక్‌డౌన్ గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి.

చైనాలో కొత్త వేరియంట్ కల్లోలం, 27వేలకు పైగా కొత్త కొవిడ్‌ కేసులు, 19 రాష్ట్రాల్లో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన జిన్‌పింగ్ ప్రభుత్వం

అయితే, ఈ వేరియంట్‌తో మరణాలు సంభవించే అవకాశం లేనప్పటికీ వేగంగా విస్తరిస్తోందని, ఫలితంగా ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాలు అతలాకుతలమయ్యే అవకాశం ఉందని షాంఘై పుడాన్ యూనివర్సిటీకి చెందిన జాంగ్ వెన్‌హాంగ్ పేర్కొన్నారు. గత 24 గంటల్లో 1337 కేసులు నమోదు కావడం, ఒక్క జిలిన్ ప్రావిన్సులోనే 895 కేసులు వెలుగు చూడడంతో ప్రభుత్వం ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. రాజధాని బీజింగ్‌లో ఆరు కేసులు, షాంఘైలో 41 కేసులు నమోదయ్యాయి. కోటిన్నరకు పైగా జనాభా ఉన్న షెన్‌జెన్ నగరాన్ని ప్రభుత్వం దిగ్బంధించింది. చాంగ్‌చున్ నగరంలో శుక్రవారం నుంచే లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. షెన్‌‌జెన్ వాసులకు ఇప్పటికే మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించింది.

చైనాలోని జిలిన్ సిటీలో క‌రోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ‌ హాస్పిట‌ల్ నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది.కేవ‌లం 6 రోజుల్లోనే 6000 బెడ్స్‌తో ఈ హాస్పిట‌ల్‌ను నిర్మించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం అయింది. జిలిన్ సిటీలో హాస్పిట‌ల్ నిర్మాణ ప‌నులు ప్రారంభం అయ్యాయి. జిలిన్ ప్రావిన్స్‌లోనే రోజుకు వెయ్యికి పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి.