Beijing, March 13: చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. కొత్త వేరియంట్ కారణంగా కరోనా పాజిటివ్ కేసులు (COVID Outbreak in China) భారీగా నమోదు అవుతుండటంతో చైనాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 2020 మార్చి తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం చైనాలో కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వివిధ నగరాల్లో వేయికి పైగా పాజిటివ్ కేసులు నమోదు(Coronavirus Crisis) కావడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్‌డౌన్ విధించారు.
మరోవైపు.. దక్షిణ చైనాలోని టెక్ హబ్‌గా ( Chinese High-Tech Shenzhen) పిలువబడే షెన్‌జెన్‌లో ఒకే రోజు 66 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. షెన్‌జెన్‌లో 1 కోటి 75 లక్షల మంది జనాభా ఉండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో వారిని ఇళ్లకే పరిమితం చేస్తూ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు కూడా నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. కాగా హువావే, టెన్ సెంట్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్‌జెన్‌లోనే ఉన్నాయి. షెన్‌జెన్ నగరం హంకాంగ్‌తో సరిహద్దును కలిగి ఉంది.
దేశంలో కొత్తగా 2503 మందికి కరోనా, గత 24 గంటల్లో 4377 మంది డిశ్చార్జ్, కొత్తగా 27 మంది మృతి
ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్‌చున్‌లో శుక్రవారం లాక్‌డౌన్ విధించారు. 90లక్షల మంది ప్రజలకు అత్యవసర హెచ్చరికలతో ఇండ్లలోనే ఉండాలని ఆదేశించారు. మరోవైపు దాదాపు 5లక్షల జనాభా ఉన్న షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని యుచెంగ్‌లో కూడా లాక్‌డౌన్ ఆంక్షలు జారీ చేశారు. ప్రస్తుతం మూడు నగరాల్లో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. హాంకాంగ్‌లో పరిస్థితి మరింత దిగజారుతూనే ఉంది.
ఇదిలా ఉండగా.. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్ చున్‌లో శుక్రవారం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. షాన్ డాంగ్ ప్రావిన్స్‌లోని యుచెంగ్‌లో కూడా లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. బీజింగ్‌లో నివాస ప్రాంతాల్లోకి ప్రవేశాన్నినిషేధించారు. దీంతో చైనా ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది.
ఇప్పటి వరకు అధికారులు 27వేలకుపైగా కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్లు నిర్ధారించారు. హాంకాంగ్‌లో కొవిడ్-19 కారణంగా మరో 87 మంది మరణించారు. చైనాలో రెండేళ్ల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు చైనాలో శనివారం నమోదయ్యాయి. కొవిడ్ కేసుల నేపథ్యంలో పలు నగరాలతో పాటు షాంఘైలో పాఠశాలలు, పార్క్‌లను మూసివేశారు. బీజింగ్‌లో నివాస ప్రాంతాల్లోకి ప్రవేశాన్ని నిషేధించారు. కొత్త కొవిడ్ కేసులను బీజింగ్‌లోని అధికారులు బయటకు రావొద్దని కోరింది. అవసరమైతే తప్ప ప్రజలు కూడా నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు.