China Plane Crash: కొండల్లో కుప్పకూలిన బోయింగ్ 737 విమానం, 133 మంది ప్రయాణికులు ఆచూకి గల్లంతు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపిన చైనా అధికారులు
చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలోని కొండల్లో కూలిపోయింది. దీంతో భారీగా అగ్నికీలలు, దట్టంగా పొగలు ఎగసిపడినట్లు చైనా అధికార మీడియా సీసీటీవీ తెలిపింది. అందులో 133 మంది ప్రయాణిస్తున్నారు. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొంది.
- Read in
- తెలుగు
చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలోని కొండల్లో కూలిపోయింది. దీంతో భారీగా అగ్నికీలలు, దట్టంగా పొగలు ఎగసిపడినట్లు చైనా అధికార మీడియా సీసీటీవీ తెలిపింది. అందులో 133 మంది ప్రయాణిస్తున్నారు. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొంది. చైనా విమానం కూలిన ఘటనలో ఎంత మంది మరణించి ఉంటారన్నది తెలియరాలేదు. అయితే విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి చెందిన బంధువులు, ఆప్తులు ఆందోళన చెందుతున్నారు.
A China Eastern Airlines aircraft carrying 133 passengers from Kunming to Guangzhou had an "accident" in the region of Guangxi & caused a fire on the mountains. The jet involved in the accident was a Boeing 737 aircraft & the number of casualties wasn't immediately known: Reuters
— ANI (@ANI) March 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 21, 2022 05:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

