Chinese COVID-19 Vaccines: మేడ్ ఇన్ చైనా వ్యాక్సిన్, చైనా తయారు చేసిన వ్యాక్సిన్లకు సామర్థ్యం చాలా తక్కువ, రక్షణ కల్పించే శక్తి లేదు, సంచలన విషయాలను వెల్లడించిన ఆ దేశ ప్రభుత్వ ఉన్నతాధికారి
చైనా వస్తువులు నాసిరకంగా ఉంటాయని చాలామంది విశ్వసిస్తున్నసంగతి విదితమే. తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ల సమయంలో కూడా ఇది బయటపడింది. తమ వ్యాక్సిన్లు సరిగా పని చేయడం లేదని, వాటిని మరింత సమర్థంగా మార్చేందుకు వ్యాక్సిన్ల మిశ్రమాన్ని తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చైనా అధికారి ఒకరు వెల్లడించారు.
Beijing, April 12: చైనా వస్తువులు నాసిరకంగా ఉంటాయని చాలామంది విశ్వసిస్తున్నసంగతి విదితమే. తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ల సమయంలో కూడా ఇది బయటపడింది. తమ వ్యాక్సిన్లు సరిగా పని చేయడం లేదని, వాటిని మరింత సమర్థంగా మార్చేందుకు వ్యాక్సిన్ల మిశ్రమాన్ని తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చైనా అధికారి ఒకరు వెల్లడించారు. కాగా వ్యాక్సిన్లపై (Chinese COVID-19 Vaccines) ఆ దేశం నుంచి ఇలాంటి ప్రకటన వెలువడటం చాలా అరుదైన విషయం.
చైనా వ్యాక్సిన్లకు ఎక్కువ రక్షణ కల్పించే శక్తి లేదు (Chinese COVID-19 Vaccines Have Low Effectiveness) అని చైనా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ గావో ఫు వెల్లడించారు. చెంగ్డులో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వాస్తవాన్ని బయటపెట్టారు. అందుకే ఆ వ్యాక్సిన్‌లన్నింటినీ కలగలిపి, దాని సామర్థ్యం పెంచేలా కొత్త వ్యాక్సిన్ తయారు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చైనా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ గావూ ఫూ వెల్లడించారు.
ఇండియాతోపాటు వివిధ దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారం చేస్తూ తమ వ్యాక్సిన్లను ప్రమోట్ చేసుకోవడానికి చైనా చాలా తంటాలు పడింది. ఇప్పటికే కోట్లాది వ్యాక్సిన్లను వివిధ దేశాలకు సరఫరా కూడా చేసింది.అలాంటిది ఇప్పుడు తమ వ్యాక్సిన్లే సరిగా పని చేయడం లేదని చైనా నోటి నుంచే రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చైనాకు చెంది సినోవాక్ వ్యాక్సిన్ సామర్థ్యం కేవలం 50 శాతమే అని బ్రెజిల్ చేసిన అధ్యయనంలోనూ తేలింది. అదే అమెరికాలో తయారైన ఫైజర్ వ్యాక్సిన్ 97శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. అయినా చైనా మాత్రం ఇప్పటి వరకూ తమ వ్యాక్సిన్లు తప్ప ఇతర దేశాల వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వలేదు. చైనా సాంప్రదాయ విధానాలు అనుసరించి వ్యాక్సిన్లను తయారు చేసింది. అయితే తాజాగా పాశ్చాత్య దేశాల టెక్నిక్ అయిన ఎంఆర్ఎన్ఏను ఉపయోగించనున్నట్లు గావో ఫు చెప్పడం గమనార్హం. ఈయనే గతంలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ రక్షణ, సామర్థ్యంపై ఇన్నాళ్లూ డ్రాగన్ దేశం సందేహాలు లేవనెత్తింది. గావూ కూడా ఎంఆర్‌ఎన్‌ఏ విధానంలో చేసే వ్యాక్సిన్లకి దుష్ప్రభావాలు ఉంటాయని గతంలో వ్యాఖ్యానిం చారు. కానీ ఇప్పుడు రూటు మార్చుకొని ఆ పద్ధతుల్లోనే టీకా తయారు చేయాలని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. చైనాలో ఇప్పటివరకు 3.4 కోట్ల మంది రెండు టీకా డోసుల్ని తీసుకోగా, 6.5 కోట్ల మంది సింగిల్ డోసుని తీసుకున్నారు.
(The above story first appeared on LatestLY on Apr 12, 2021 04:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

