Sputnik V Vaccine: ఇండియాకు త్వరలో రష్యా స్పుత్నిక్-వి వ్యాక్సిన్, ఆర్‌డీఎఫ్ తో భారీ డీల్ కుదుర్చుకున్న డా.రెడ్డీస్ ల్యాబ్, పదికోట్ల మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తికి రెడ్డీస్ ల్యాబ్ రెడీ
కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రష్యా కరోనా వ్యాక్సిన్ మీద ఆశలు చిగురుస్తున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ ఇండియాకు వస్తుందా రాదా అనే సందేహం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ (Dr Reddy Laboratories) రష్యాతో భారీ ఒప్పందాన్ని సొంతం చేసుకుంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ (Sputnik V Vaccine) పంపిణీ, క్లినికల్ ట్రయల్స్ కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (RDF)తో భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పదికోట్ల (100 మిలియన్ల ) మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది.
Moscow, September 16: కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రష్యా కరోనా వ్యాక్సిన్ మీద ఆశలు చిగురుస్తున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ ఇండియాకు వస్తుందా రాదా అనే సందేహం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ (Dr Reddy Laboratories) రష్యాతో భారీ ఒప్పందాన్ని సొంతం చేసుకుంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ (Sputnik V Vaccine) పంపిణీ, క్లినికల్ ట్రయల్స్ కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (RDF)తో భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పదికోట్ల (100 మిలియన్ల ) మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది.
ఒకవేళ తమ వ్యాక్సిన్‌కు భారత్‌లో (India) ఆమోదం దక్కితే, అప్పుడు సుమారు వంద మిలియన్ల డోస్‌ల స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ ల్యాబ్‌కు సరఫరా చేయనున్నట్లు ఆర్‌డీఐఎఫ్ పేర్కొన్నది. రష్యాలో ఇటీవల స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే నవంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ దిమిత్రేవ్ వెల్లడించారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుందన్నారు. దశాబ్దాలుగా 250 కి పైగా క్లినికల్ అధ్యయనాలలో పరీక్షించబడిందని,ఇందులో దీర్ఘకాలిక ప్రతికూలతలు లేకుండా సురక్షితంగా తేలిందన్నారు. అలాగే ఈ టీకా తయారీ మరో నాలుగు భారతీయ తయారీదారులతో చర్చలు జరుపుతున్నామన్నారు.
ఒకటి, రెండు దశల ప్రయోగాల్లో సానుకూల ఫలితాల నేపథ్యంలో మూడు దశ ట్రయల్స్ నిర్వహించనున్నామని రెడ్డీస్ సీఈవో జీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ సహా రష్యా వ్యాక్సిన్‌పై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘స్పుత్నిక్ వి’కి మూడో దశ పరీక్షలకు భారత్‌లో రెడ్డీస్ ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, తయారీకి పుణేకు చెందిన సీరం సంస్థ ఒప్పందాన్ని చేసుకుని ప్రయోగాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
(The above story first appeared on LatestLY on Sep 16, 2020 04:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

