Donald Trump: గొంతు నొక్కేందుకు జరుగుతున్న కుట్ర, తన ట్విట్టర్ ఖాతా బ్యాన్‌పై స్పందించిన డొనాల్డ్ ట్రంప్, త్వరలో కీలక ప్రకటన చేస్తామని వెల్లడి, సొంత వేదికను ఏర్పాటు చేసే దిశగా అడుగులు

తన పదవీకాలం మరి కొద్ది రోజుల్లో ముగియనున్నా కూడా ట్రంప్ (Donald Trump) మాత్రం తన తీరు మార్చుకునేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా ట్విటర్ తనపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. తన ఖాతాపై శాశ్వత నిషేధం విధించిన ట్విటర్‌ (Twitter ban) నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. సోషల్‌ మీడియా దిగ్గజ తీరుపై మండిపడిన ఆయన.. ఇలాంటిదేదో జరుగుతుందని తాను ముందే ఊహించానన్నారు.

Donald Trump: గొంతు నొక్కేందుకు జరుగుతున్న కుట్ర, తన ట్విట్టర్ ఖాతా బ్యాన్‌పై స్పందించిన డొనాల్డ్ ట్రంప్, త్వరలో కీలక ప్రకటన చేస్తామని వెల్లడి, సొంత వేదికను ఏర్పాటు చేసే దిశగా అడుగులు
Donald Trump at White House (Photo Credits: Trump Twitter page)

Washington, Jan 9: తన పదవీకాలం మరి కొద్ది రోజుల్లో ముగియనున్నా కూడా ట్రంప్ (Donald Trump) మాత్రం తన తీరు మార్చుకునేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా ట్విటర్ తనపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. తన ఖాతాపై శాశ్వత నిషేధం విధించిన ట్విటర్‌ (Twitter ban) నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. సోషల్‌ మీడియా దిగ్గజ తీరుపై మండిపడిన ఆయన.. ఇలాంటిదేదో జరుగుతుందని తాను ముందే ఊహించానన్నారు.

తన వ్యక్తిగత ఖాతా నిషేధానికి గురైన వెంటనే ట్రంప్ తన అధికారిక ఎకౌంట్‌ను ట్వీట్ చేయడం ప్రారంభించారు. అయితే..ట్విటర్ మాత్రం అభ్యంతరకరమైన ట్వీట్‌లను వెంట వెంటనే తొలగించింది. దీంతో పాటు ట్రంప్ బృందానికి చెందిన మరో ఎకౌంట్‌ను కూడా తొలగించింది. దీంతో ట్రంప్ భగ్గుమన్నారు. శ్వేత శౌధం నుంచి అధికారిక ప్రకటన చేశారు. ‘ఇది జరుగుతుందని ముందే ఊహించా. అయితే..మేం ఇతర వెబ్‌సైట్లతో చర్చలు జరుపుతున్నాం. త్వరలో కీలక ప్రకటన చేస్తాం. భవిష్యత్తులో తన అభిప్రాయాలు ప్రజలకు చేరేలా ఓ సొంత వేదికను ఏర్పాటు చేసుకునే అవకాశాల్నీ పరిశీలిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

తన గొంతు నొక్కేందుకు జరుగుతున్న కుట్రగా ట్విటర్ నిషేధాన్ని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా.. తన అభిప్రాయాలను ప్రజలకు చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెత్కుక్కుంటున్నట్టు ప్రకటించారు. ట్విటర్‌లో భావప్రకటన స్వేచ్ఛ లేదని, రాడికల్‌, వామపక్ష భావజాలాన్ని ప్రోత్సహించే ప్లాట్‌ఫాం అంటూ విరుచుకుపడ్డారు. అక్కడ కేవలం విషం చిమ్ముతూ మాట్లాడే వారికే ప్రాధాన్యం ఉంటుందని అక్కసు వెళ్లగక్కారు. అయితే ఇలాంటి పరిణామాలు తమను ఆపలేవని, ట్విటర్‌ చర్యతో తాను, తన మద్దతుదారులు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

జో బైడెన్‌ను అమెరికా అధ్యక్షుడిగా అధికారికంగా ధ్రువీకరించిన యూఎస్ కాంగ్రెస్, ఎట్టకేలకు తలవంచిన ట్రంప్.. అధికార బదిలీకి సుముఖత, జనవరి 20న బైడెన్ ప్రమాణస్వీకారానికి మార్గం సుగమం

ప్రజలకు చేరువగా ఉండేందుకు ఇతర సైట్లతో సంప్రదింపులు జరుపుతున్నామన్న ట్రంప్‌, సమీప భవిష్యత్తులో తమ సొంత ప్లాట్‌ఫాంను తీసుకువచ్చే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అతిపెద్ద ప్రకటన వెలువడుతుందని, సైలెంట్‌గా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ట్విటర్‌ పదే పదే వాక్‌ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్చపై నిషేధం విధిస్తోంది. డెమొక్రాట్లు, రాడికల్స్‌తో ట్విటర్‌ ఉద్యోగులు సమన్వయం చేసుకుంటూ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. నా గొంతు నొక్కేందుకు అకౌంట్‌ను తొలగిస్తారా? దేశభక్తులైన 75,000,000 మంది నాకు ఓటు వేశారని మీకు తెలుసా? ట్విటర్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీ. సెక్షన్‌ 230 ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన వెసలుబాట్లు లేకపోతే మీ ఉనికే ఉండదు’’ అని ట్రంప్‌ ఘాటు విమర్శలు చేశారు.

కాగా రెండు రోజుల క్రితం ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ బిల్డింగ్‌ భవనాన్ని ముట్టడించడంతో హింస చెలరేగిన విషయం తెలిసిందే. వారిని ప్రోత్సహించే విధంగా ట్రంప్‌ చేసిన ట్వీట్లు చేశారంటూ ట్విటర్‌ యాజమాన్యం ఆయన అకౌంట్‌ను శాశ్వతంగా సస్పెండ్‌ చేస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌ సైతం ఇదే బాటలో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

(The above story first appeared on LatestLY on Jan 09, 2021 04:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).