Tiffany Trump Marriage: తనకంటే వయసులో నాలుగేండ్లు చిన్నవాడైన బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్ బౌలస్‌ను పెళ్లాడిన ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్.. దగ్గరుండి పెళ్లి జరిపించిన అమెరికా మాజీ అధ్యక్షుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-నటి మార్లా మాపెల్స్ ఏకైక కుమార్తె టిఫానీ ట్రంప్ (29) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. బాయ్ ఫ్రెండ్ మైఖేల్ బౌలస్‌ (25) ను శనివారం సాయంత్రం సౌత్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న తమ ఫ్యామిలీ క్లబ్‌లో వివాహం చేసుకున్నారు.

Tiffany Trump Marriage: తనకంటే వయసులో నాలుగేండ్లు చిన్నవాడైన బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్ బౌలస్‌ను పెళ్లాడిన ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్.. దగ్గరుండి పెళ్లి జరిపించిన అమెరికా మాజీ అధ్యక్షుడు
Tiffany Trump, Michael Boulos (Instagram)

Newyork, Nov 14: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)-నటి మార్లా మాపెల్స్ ఏకైక కుమార్తె టిఫానీ ట్రంప్ (29) (Tiffany Trump) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. బాయ్ ఫ్రెండ్ మైఖేల్ బౌలస్‌ (25) (Michael Boulos)ను శనివారం సాయంత్రం సౌత్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న తమ ఫ్యామిలీ క్లబ్‌లో వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అక్షయ్ కుమార్ తో కలిసి డ్యాన్స్ చేసిన రామ్ చరణ్... ఢిల్లీలో హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో డ్యాన్సులతో హుషారెత్తించిన అగ్రహీరోలు.. వీడియో ఇదిగో!

లాంగ్ స్లీవ్ వెడ్డింగ్ గౌనులో టిఫానీ మెరిసిపోయారు. ఆమె తల్లి మార్లా లావెండర్ ఈవెనింగ్ గౌన్ ధరించారు. ఈ రెండింటినీ ప్రముఖ డిజైనర్ ఇలీ సాబ్ రూపొందించారు. ఈ వివాహానికి ట్రంప్ సహా ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్‌డ్ కుష్నర్, మెలానియా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, బరోన్ ట్రంప్ తదితరులు హాజరయ్యారు. ట్రంప్ దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారు. టిఫానీని వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చిన ట్రంప్ ఆ తర్వాత ఆమెకు  ముద్దుపెట్టి వరుడు మైఖేల్‌కు వధువు చేతిని అందించారు.

(The above story first appeared on LatestLY on Nov 14, 2022 10:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).