Newdelhi, Nov 14: ఢిల్లీలో (Delhi) జరిగిన హిందూస్థాన్ టైమ్స్ (Hindusthan Times) నాయకత్వ సదస్సులో టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ (Ram Charan) కూడా పాల్గొన్నారు. రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తో కలిసి ఉల్లాసంగా డ్యాన్స్ చేశారు. తన హిట్ చిత్రం 'రంగస్థలం'లోని 'రంగమ్మ' పాటకు హుషారుగా స్టెప్పులేశారు. అంతేకాదు, అక్షయ్ కుమార్ హిట్ సాంగ్ 'తూ చీజ్ బడీహై మస్త్ మస్త్' సాంగ్, పాత పాట 'యే దోస్తీ'కి కూడా ఇరువురు డ్యాన్స్ చేయడం ఈ లీడర్షిప్ సమ్మిట్ లో అందరినీ అలరించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Best moment of the day... @AlwaysRamCharan dances on the tunes of Tu Cheez Badi Hai Mast Mast with @akshaykumar. #HTLS2022 #RamCharan #AkshayKumar pic.twitter.com/3oMENZ73cP
— Monika Rawal (@monikarawal) November 12, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)