Rome, April 2: కృత్రిమ మేధ (ఏఐ) (AI) సాంకేతికత ఆధారంగా తయారుచేసిన చాట్ జీపీటీ (ChatGPT) ప్రపంచ టెక్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఆరోగ్యం (Health) నుంచి అంతరిక్షం వరకు, చరిత్ర నుంచి సైన్స్ వరకు రాజకీయాల నుంచి వినోదం వరకు ఇలా ఏ అంశం గురించి అడిగినా అందుబాటులో ఉన్న సంపూర్ణ సమాచారాన్ని విశ్లేషించి, పరిష్కారం చూపడం చాట్ జీపీటీ ప్రత్యేకత. అయితే, అనేక దేశాలు ఆ చాట్ బాట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చాట్ జీపీటీని రష్యా, ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ నిషేధించగా... ఇప్పుడా దేశాల బాటలో ఇటలీ (Italy) కూడా నడిచింది. చాట్ జీపీటీని నిషేధిస్తున్నట్టు ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఓ ప్రకటన చేసింది.
Italy temporarily bans ChatGPT | NHK WORLD-JAPAN News https://t.co/FL6oUOF62c
— tesfayee (@tesfayee2011) April 2, 2023
నిషేధం ఎందుకంటే?
డేటా నియమాల ఉల్లంఘన కేసు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇటలీ భద్రతా నిబంధనలకు ఇది లోబడి ఉందా? లేదా? అనే అంశం పరిశీలిస్తామని వెల్లడించింది.