PBKS vs KKR (PIC @ IPL Twitter)

Mohali, April 01: ఐపీఎల్ 16వ సీజ‌న్‌ను పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజ‌యంతో ఆరంభించింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై (Kolkata Knight Riders) 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించ‌డంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప్ర‌కారం (DLS method) పంజాబ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు. వ‌ర్షం ప‌డే స‌మ‌యానికి కేకేఆర్ 16 ఓవ‌ర్లకు 153 స్కోర్ చేయాలి. కానీ, ఆ జ‌ట్టు 7 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతున్న మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. వ‌ర్షం ప‌డుతుండ‌డంతో పిచ్‌ను క‌వ‌ర్ల‌తో క‌ప్పేశారు. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప్ర‌కారం 16 ఓవ‌ర్లు ముగిసే సరికి కేకేఆర్ 153 స్కోర్ చేయాలి. కానీ, ఆ జ‌ట్టు 7 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తలపడ్డాయి.

టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ముందు 192 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. భానుక‌ రాజ‌ప‌క్సే (50) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్(40), ఓపెన‌ర్ ప్ర‌భ్‌సింహ్ రానా సింగ్ (23) వికెట్ కీప‌ర్ జితేశ్ శ‌ర్మ(21), సికింద‌ర్ ర‌జా (16) రాణించారు. అర్ష్‌దీప్ సింగ్ దెబ్బ‌కు ఏడో వికెట్ కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ వెంక‌టేశ్ అయ్యార్ (32) ఔట‌య్యాడు. అర్ష్‌దీప్ వేసిన 16వ ఓవ‌ర్ మూడో బంతికి అయ్య‌ర్ క‌వ‌ర్స్‌లో రాహుల్ చాహ‌ర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరాడు.