Japanese Schools Ban Ponytails: అలాంటి జుట్టు వేసుకుంటే అబ్బాయిలు ఆగలేకపోతున్నారట! పోనీటెయిల్స్ పై జపాన్ నిషేదం, విద్యార్ధినులకు స్కూల్స్ ఆంక్షలు, లో దుస్తుల కలర్ పై కూడా సూచనలు
అమ్మాయిలు పోనీటెయిల్స్ (Ponytails) వేసుకుంటే క్యూట్ గా కనిపిపిస్తారు. అందుకే చాలామంది అమ్మాయిలు పోనీ టైల్ (Ponytails) వేసుకుంటారు. కానీ ఇకనుంచి అలా పోనీ టైల్ వేసుకోకూడదని ఆంక్షలు విధించారు. ఈ ట్రెండీ హెయిర్‌స్టైల్‌పై జపాన్ లోని ఓ స్కూల్ నిషేధం విధించింది.
Japan, March 13: టెక్నాలజీ ఎంత పెరిగినా....అమ్మాయిల విషయంలో ఆంక్షలు అన్ని దేశాల్లో కామన్ గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారత్ (India) లోని కొన్ని ప్రాంతాల్లో హిజాబ్ పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే టెక్నాలజీకి మారుపేరుగా ఉన్న జపాన్ లో కూడా అమ్మాయిల దుస్తులు, జుట్టు విషయంలో ఆంక్షలు విధించారు. స్కూల్లో విద్యార్ధినిలు వేసుకునే హెయిర్ స్టైల్స్ (Hair Styles) విషయంలోనూ..ఆఖరికి వారు ధరించే లో దుస్తులు విషయంలో కూడా ఆంక్షలు విధించింది జపాన్. అమ్మాయిలు పోనీటెయిల్స్ (Ponytails) వేసుకుంటే క్యూట్ గా కనిపిపిస్తారు. అందుకే చాలామంది అమ్మాయిలు పోనీ టైల్ (Ponytails) వేసుకుంటారు. కానీ ఇకనుంచి అలా పోనీ టైల్ వేసుకోకూడదని ఆంక్షలు విధించారు. ఈ ట్రెండీ హెయిర్‌స్టైల్‌పై జపాన్ లోని ఓ స్కూల్ నిషేధం విధించింది. స్కూళ్లకు వచ్చే అమ్మాయిలు పోనీటెయిల్ వేసుకురాకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది జపాన్ (Japan)ప్రభుత్వం.
అమ్మాయిలు పోనీటెయిల్ (Ponytails) వేసుకుని రావడం వల్ల జుట్టు కింద మెడ భాగం బయటకు కనిపిస్తుందని, దీనివల్ల క్లాస్ రూమ్ లో విద్యార్థుల దృష్టి మరలుతుందని ఓ సర్వేలో తేలిందట..అందుకే జపాన్ ప్రభుత్వం ఇటువంటి వింత ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. అమ్మాయిల మెడభాగం విద్యార్థులను లైంగికంగా ఉద్రేకపరుస్తుందని అందుకే ఈ కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు జపాన్ (Japan) అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక జపాన్‌లోని ఫుకుయోకా ప్రాంతంలోని కొన్ని స్కూల్స్ లో ఇటీవల ఒక సర్వే నిర్వహించగా..పోనీటెయిల్ కారణంగా కనిపించే అమ్మాయిల మెడ వల్ల అబ్బాయిలు ఉద్రేకానికి లోనవుతున్నారని ఈ సర్వేలో తేలింది. దీంతో స్కూల్ కు వెళ్లే ఆడపిల్లలు పోనీటెయిల్ జడ వేసుకొని రావడాన్ని నిషేధించారు. పోనీ టైల్ లేదా జడగానీ వేసుకుంటే మెడ భాగం బయటకు కనిపిస్తుందని పోనీ టెయిల్ నిషేధించిన ప్రభుత్వం.. అదే మెడ బయటకు కనిపించే ఆస్కారమున్న బాబ్ హెయిర్ స్టైల్‌ను వేసుకోవచ్చని తెలిపింది.
జపాన్‌లో అమ్మాయిలకు సంబంధించి ఇటువంటి ఆంక్షలే కాదు ఇంకా చాలానే ఉన్నాయి. చిత్ర విచిత్రమైన నియమాలు, ఆంక్షలు ఉన్నాయి. జపాన్ లోని స్కూల్స్ కు వెళ్లే అమ్మాయిల సాక్స్ పొడవుగా ఉన్నవే ధరించాలి.అలాగే స్కర్ట్ కూడా పొడవుగా ఉండాలి. అంటే మోకాలు దాటి ఉండాలి. అంతేకాదు అమ్మాయిలు ధరించే లో దుస్తులు విషయంలో కూడా ఆంక్షలున్నాయి. అమ్మాయిలు తెల్లని రంగు ఉన్న లోదుస్తులు మాత్రమే ధరించాలని ఆంక్షలు విధించారు. అంతేనా ఇంకా ఉన్నాయి..జుట్టుకు నలుపు తప్ప ఎలాంటి రంగు వేసుకోకూడదు.
(The above story first appeared on LatestLY on Mar 13, 2022 11:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

