Karnataka Hijab Row: కర్ణాటక హిజాబ్ వ్యవహారంపై మలాలా ట్వీట్, ఆడపిల్లలను హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం, మహిళలను చిన్నచూపును ఆపాలంటూ ఆవేదన
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం రోజు రోజుకు రాజకీయ రంగును పులుముకుంటోంది. తాజాగా ఈ అంశంపై ఉద్యమకారిణి, నోబెల్ గ్రహీత మలాలా స్పందించారు. బాలికలను హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లనివ్వాలని మలాలా భారతీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తోంది.
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం రోజు రోజుకు రాజకీయ రంగును పులుముకుంటోంది. తాజాగా ఈ అంశంపై ఉద్యమకారిణి, నోబెల్ గ్రహీత మలాలా స్పందించారు. బాలికలను హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లనివ్వాలని మలాలా భారతీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తోంది. యూసఫ్‌జాయ్ ట్వీట్లో.. చదువు, హిజాబ్‌లో ఏది ఎంచుకోవాలో కళాశాల మమ్మల్ని బలవంతం చేస్తోంది అంటూ విద్యార్థిణిలు ఆవేదనను ట్వీట్ చేసిన ఆమె.. ఆపై భారతీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. బాలికలు తమ హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం భయానకంగా ఉందని వ్యాఖ్యానించారామె. ఆడపిల్లలను హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం. భారత నాయకులు ముస్లిం మహిళలను చిన్నచూపును ఆపాలి. అంటూ ఆమె ఒక ట్వీట్ చేశారు.
“College is forcing us to choose between studies and the hijab”.
Refusing to let girls go to school in their hijabs is horrifying. Objectification of women persists — for wearing less or more. Indian leaders must stop the marginalisation of Muslim women. https://t.co/UGfuLWAR8I
— Malala (@Malala) February 8, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 09, 2022 11:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

